వితిన్‌ వన్‌ మంత్‌... డాడీ మళ్లీ నవ్వుతాడు! | Sakshi
Sakshi News home page

వితిన్‌ వన్‌ మంత్‌... డాడీ మళ్లీ నవ్వుతాడు!

Published Sun, Nov 26 2023 4:36 AM

Rohit Sharma Daughter, Samaira cute video re-surfaces after Indian team - Sakshi

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఫలితం ‘అయ్యయ్యో’ అనిపించింది. కన్నీళ్ల పర్యంతం అయిన రోహిత్‌శర్మను చూసిన తరువాత ఈ ‘అయ్యయ్యో’లు  రెట్టింపు అయ్యాయి. ఈ అయ్యయ్యోల సంగతి ఎలా ఉన్నా రోహిత్‌శర్మ కూతురు సమైర వీడియో క్లిప్‌ ఇంటర్‌నెట్‌లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

ఈ వీడియోలో... సమైర తల్లితో కలిసి వస్తుంటే రోహిత్‌ గురించి ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అని  ఎవరో అడిగారు. ‘రూమ్‌లో ఉన్నారు. వితిన్‌ వన్‌ మంత్‌ ఆయన మళ్లీ నవ్వుతాడు’ అన్నది సమైర. ఈ చిన్నారి పెద్దరికానికి నెటిజనులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది ఏదో సందర్భంలో ఒక అభిమాని షేర్‌ చేసిన వీడియో. అయితే మాత్రం ఏమిటీ తాజా పరిస్థితికి జిరాక్స్‌లా ఉంది.

Advertisement
 
Advertisement