
నగరవాసుల్లో తీర్థయాత్రల ఆసక్తి ఏ ప్రతి యేటా పెరుగుతోంది. విశేషం ఏమిటంటే ఈ ఆసక్తి వయసులకు అతీతంగా వ్యక్తమవుతోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగా తీర్థయాత్ర ధోరణులపై ప్రముఖ టూర్ ఆపరేటర్ మేక్‌మైట్రిప్ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.
అత్యధిక శాతం మంది చేసిన యాత్రల్లో.. ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్), వారణాసి (ఉత్తరప్రదేశ్), అయోధ్య (ఉత్తరప్రదేశ్), పూరి (ఒడిశా), అమృత్‌సర్ (పంజాబ్), తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో ఖాటాశ్యామ్ జీ (రాజస్థాన్), ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), తిరుచెందూర్ (తమిళనాడు) వంటి మరికొన్ని కూడా తీర్థయాత్రల గమ్యస్థానాలుగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
వయసులకు అతీతంగా..
అన్ని వయసుల, ఆదాయ వర్గాలకు చెందిన భారతీయులు ఈ తరహా తీర్థయాత్రల పట్ల ఆసక్తి
కనబరుస్తున్నారు. విహార యాత్రకు వెళ్లేవారిలో కుటుంబాలు, స్నేహితుల సమూహాలుగా వెళ్లేవారు 38.9% మంది కాగా తీర్థయాత్రకు అలా బృందాలుగా వెళ్లేవారు 47% మంది ఉన్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.
(చదవండి: జర్మన్ ఫెస్ట్.. జాయ్ మస్ట్..)