వామ్మో..! రాను రాను హోటల్‌లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..! | Delhi Based CEO Shares Pic Of Virtual Receptionist At Bengaluru Hotel Divides Internet, See Details | Sakshi
Sakshi News home page

వామ్మో..! రాను రాను హోటల్‌లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!

Oct 9 2024 11:46 AM | Updated on Oct 9 2024 11:55 AM

Pic Of Virtual Receptionist At Bengaluru Hotel Divides Internet

బెంగళూరులోని ఒక హోటల్‌లోకి అడుగు పెట్టిన అనన్య నారంగ్‌కు రిసెప్షనిస్ట్‌ స్వాగతం పలికింది. అనన్యలో షాక్‌లాంటి ఆశ్చర్యం. ‘ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది!’ అనే కదా మీ డౌటు. అయితే సదరు ఈ రిసెప్షనిస్ట్‌ సాధారణ రిసెప్షనిస్ట్‌ కాదు... వర్చువల్‌ రిసెప్షనిస్ట్‌!

‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా బెంగళూరులో వర్చువల్‌ రిసెప్షనిస్ట్‌’ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన దేశంలో నవీన సాంకేతికత గురించి వివరంగా మాట్లాడుకునేలా చేస్తోంది. ‘సాంకేతికత సహాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులను ఏకకాలంలో సమన్వయం చేస్తున్నారు. 

సిలికాన్‌ వ్యాలీలో తప్ప మన దేశంలో ఎక్కడా ఇలాంటి దృశ్యం కనిపించదు’ అంటూ ఈ ‘వర్చువల్‌ రిసెప్షనిస్ట్‌’ ఫొటోని షేర్‌ చేసింది అనన్య. ‘ఎంత సాంకేతిక ప్రగతి’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘అబ్బబ్బే! ఇదేం ప్రగతి. అందమైన మానవ రిసెప్షనిస్ట్‌ స్వాగతం పలకడానికి, వర్చువల్‌ రిసెప్షనిస్ట్‌ స్వాగతం పలకడానికి చా...లా తేడా ఉంటుంది’ అనే వాళ్లే ఎక్కువ! 

(చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement