2012లో కోల్‌కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లోని ఒక నైట్ క్లబ్‌లో స్నేహితులతో కదులు తున్న కారులో ఒక మహిళపై సామూహిక అత్యాచారచేసిన శిక్ష అనుభవించిన నాజర్ ఖాన్ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. కోల్‌కత్తాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఒక మహిళను లైంగికంగా వేధించాడు. గాజు సీసాలతో దాడి చేశాడు.
సంచలనం రేపిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన 35 ఏళ్ల నాజర్ ప్రెసిడెన్సీ జైలు నుండి బయటకు వచ్చాడు. మంచి ప్రవర్తన కారణంగా ఏడాది ముందే జైలు విడుదలైన అతగాడు ఏమీ మారలేదు సరికదా, మరోసారి తన దుర్మార్గ వైఖరిని చాటుకున్నాడు. కోల్‌కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లోని 5-స్టార్ హోటల్‌లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన భర్త, స్నేహితులతో ఉండగా, ఆమెను వేధించడంతోపాటు, గాజుసీసాలతో వారిపై దాడికి పాల్పడ్డాడు. బిధాన్‌నగర్‌లోని హయత్ రీజెన్సీలోని ప్లే బాయ్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈకేసులో ఉన్న నిందితులతోపాటు 2012 పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన నాజర్ ఖాన్ ఉన్నాడు. మరో నిందితుడు నాజర్ మేనల్లుడు జునైద్ ఖాన్. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
క్లబ్‌లో తాను, తన భర్త, సోదరుడు, ఇతర స్నేహితులతో కూర్చుని ఉండగా నిందితులు గలాటా చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నాజర్, జునైద్ ఇంకా వారి స్నేహితులు తమపై దాడి చేసి, తనను అనుచితంగా తాకడానికి ప్రయత్నించారని ఆ మహిళ ఆరోపించింది. సోదరుడు తనను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, గాజు సీసాలు విసిరారని పేర్కొంది. హోటల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించి నప్పటికీ వారు వదల్లేదనీ, జునైద్ ఖాన్ దాదాపు 20 మందికి ఫోన్ చేసి తమపై దాడి చేశాడని, ఫోన్‌లో చంపుతామని కూడా బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ క్లబ్ CCTVలో ఈ దాడికి సంబంధించిన మొత్తం వీడియోను మీరు చూడవచ్చన్నారు ఆమె.
కాగా 2012 ఫిబ్రవరిలో నగరం నడిబొడ్డున ఉన్న పార్క్ స్ట్రీట్‌లోని ఒక నైట్ క్లబ్ ముందు 40 ఏళ్ల మహిళను కారులో తీసుకెళ్లి, కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేసి, రోడ్డు క్రాసింగ్ దగ్గర విసిరేసి వెళ్లిపోయారు. ఈ కేసులో దోషిగా తేలిన ఐదుగురు వ్యక్తులలో నాజర్ కూడా ఉన్నాడు. పదేళ్ల శిక్షాకాలం ముగియడానికి ఒక సంవత్సరం కంటే ముందే 2020లో జైలు నుండి విడుదలయ్యాడు.
ఇదీ చదవండి: హ్యాండ్సమ్ బాయ్ : సినీ స్టార్‌లా ఇంత అందమా? ఎలా?


