భార్య కోసం ఉద్యోగం వదిలేసి..! | This mechanical engineer from Bihar chose to become a househusband | Sakshi
Sakshi News home page

భార్య కోసం ఉద్యోగం వదిలేసి..!

Jun 30 2026 4:57 PM | Updated on Jun 30 2026 6:27 PM

This mechanical engineer from Bihar chose to become a househusband

గృహిణి అన్న మాట విన్నంతగా గృహస్థుడు అన్న మాట చాలా తక్కువ, అరుదు. పైగా పిల్లలు పుడితే చాలామటుకు భార్యలే తమ కెరీర్‌ని వదులకుంటారు. కొందరు మహిళలు పిల్లలు కాస్త పెద్దయ్యాక మళ్లీ తమ కెరీర్‌ని మొదలుపెడతారు. కానీ ఈ భర్త స్త్రీ పురుషులు సమానం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ప్రతీ మగాడి విజయం వెనకాలే కాదు ఓ మహిళ విజయం వెనకాల కూడా ఓ మగాడు ఉంటాడు. అది సాధ్యమే అని నిరూపించాడు ఈ వ్యక్తి. 

బిహార్‌లోని మోతిహారి జిల్లా చంపారన్‌కు చెందిన అమిత్ కుమార్ దూబే వైవాహిక జీవితంలో భర్త పాత్రకు కొత్త నిర్వచనం చెప్పాడు. అతడు గృహిణి మాదిరిగా ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. అమిత్‌ డిప్లోమా మెకానిక్‌ ఇంజనీర్‌. అతడు ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం 2015 డిసెంబర్‌లో అయ్యింది. తన భార్య ప్రీతి ఉద్యోగం కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 

నిజానికి అమిత్‌ హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసేవాడు. అతడి భార్య మరొక చోట బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం చేస్తుండేది. ఇలా ఇరువుకి మధ్య ఉద్యోగ రీత్యా ఉన్న ఎడబాటుని భరించలేక ఆమె పనిచేసే చోటే ఉద్యోగం చూసుకున్నాడు కూడా. అయితే ఆమెకు గర్భస్రావం అవ్వడంతో ఆమె బాగోగులు కోసం కొన్నేళ్లు సెలవు పెట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో లాంగ్‌ లీవ్‌ పెట్టడానికి ప్రైవేట్‌ కంపెనీ అనుమతించకపోవడంతో జాబ్‌ వదులుకోక తప్పలేదన్నారు. 

ఆ తర్వాత ఆమె మరోసారి ప్రెగ్నెంట్‌ అవ్వడంతో తానే దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకోండం కోసం మళ్లీ తిరిగి జాబ్‌లో జాయిన్‌ అవ్వలేకపోయానన్నారు. తమకు ఒక పాప అని అన్నారు. అయితే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం తోపాటు బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడం కష్టంగా మారడంతో ఇక తానే ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యతలను తీసుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పుకొచ్చారు. రోజంతా ఇంటి పనులు చూసుకోవడం, కూతురికి హోం వర్క్‌లో సహయం చేయడం వంటివి చేస్తుంటానని అన్నారు. 

అప్పుడప్పుడూ ఒంటరిగా ఉంటే..మాత్రం తానేమి చేయలేకపోతున్నాననే బాధ అయితే వస్తుంటుందని అన్నాడు. తనే ఇంటికి పెద్ద వాడినని, చెల్లెళ్లు లేరని అన్నారు. అయితే పెద్దవాడిగా తన కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఖాళీ సమయంలో ఫుడ్‌ బిజినెస్‌  చేద్దామనే ఆలోచన ఉందని, అందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. 

ఉద్యోగక కెరీర్‌ కోల్పోయానన్న బాధ ఉన్నా..తను చేస్తున్న పనిని చాలామంది అభినందిస్తున్నారని, అందుకు చాలా సంతోషం ఉంటుందని అంటున్నాడు. నిజంగా అమిత్‌ చాలా గ్రేట్‌ కదూ..మెకానికల్‌ ఇంజనీర్‌ అయినప్పటికీ..తన గురించి అభద్రతా భావానికి లోనుకాకుండా..తన భార్యకు అండగా నిలుస్తూ..కూతురు బాగోగులు చూసుకోవడం కోసం తన కెరీర్‌ని వదులుకున్నాడు. అంతేగాదు గృహనిర్వహణ గౌరవప్రదమైనదే అని, మగవాళ్లు కూడా నిర్వర్తించొచ్చు అని నిరూపించాడు.

 

(చదవండి:  Upasana Konidela: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్‌ తర్వాత బరువు తగ్గాలంటే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement