Photo Feature: చిట్టచివరి షాహీ స్నానాలు | Local To Global Photo Feature Telugu April 28, 2021 | Sakshi
Sakshi News home page

Photo Feature: చిట్టచివరి షాహీ స్నానాలు

Apr 28 2021 7:58 PM | Updated on May 7 2021 8:40 PM

Local To Global Photo Feature Telugu April 28, 2021 - Sakshi

హరిద్వార్‌ కుంభమేళాలో భక్తులు మంగళవారం చిట్టచివరి షాహీ స్నానాలు ఆచరించారు. కోవిడ్‌ కేసుల తీవ్రత, ప్రధాని మోదీ విజ్ఞాపన మేరకు తక్కువమంది సాధువులు ఈ కార్యక్రమంలో లాంఛనప్రాయంగా పాల్గొన్నారు. బుధవారం నుంచి హరిద్వార్‌లో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

1
1/4

భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గంగాళంలో నీరు పోసి సుదర్శన చక్రానికి చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వాస్తవానికి ఈ వేడుకను పవిత్ర గోదావరి నదిలో జరపాల్సి ఉండగా.. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఆలయంలోనే నిరాడంబరంగా జరిపించారు.

2
2/4

జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ చిన్నజయంతిని మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. కోవిడ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో భక్తులను కొండపైకి అనుమతించలేదు. మాల విరమణకు కూడా అవకాశం లేకపోవడంతో భక్తులు కొండదిగువ నుంచే మొక్కులు చెల్లించుకుని వెనుదిరిగారు. కొండపైకి అనుమతించకపోవడంతో కొండ దిగువనుంచే మొక్కుతున్న ఓ భక్తుడు.

3
3/4

మెడికల్‌ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఆస్పత్రులకు పోలీసు రక్షణ మధ్య ఆక్సిజన్‌ ట్యాంకర్‌ తరలింపు

4
4/4

కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో స్వస్థలాలకు పయనమైన వలస కార్మికులతో రద్దీగా మారిన గురుగ్రామ్‌లోని రాజీవ్‌ చౌక్‌ బస్టాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement