గొర్రెల కాపరి నుంచి దేశ నాయకుడు.. | The Life Story Of South African President Nelson Mandela | Sakshi
Sakshi News home page

గొర్రెల కాపరి నుంచి దేశ నాయకుడు..

Jun 20 2026 1:17 PM | Updated on Jun 20 2026 1:37 PM

The Life Story Of South African President Nelson Mandela

కిడ్స్‌ స్పెషల్‌

మహనీయుల బాల్యం: నెల్సన్‌ మండేలా

‘రోలిహ్లాహ్లా మండేలా’ చిన్నప్పుడు దక్షిణాఫ్రికాలోని ‘కును’ అనే పల్లెటూరిలో పెరిగాడు. చిన్నతనంలో రోజంతా పొలాల్లో గొర్రెలను, పశువులను మేపుతూ, చెప్పులు లేకుండా ఎండలో తిరుగుతూ తోటి పిల్లలతో కలిసి మట్టితో ఆడుకునేవాడు. మండేలాకు ఏడేళ్లు వచ్చాక వాళ్ల అమ్మ స్కూల్‌కి పంపింది. అక్కడే ఒక టీచర్‌ అతనికి ‘నెల్సన్‌’ అని పేరు పెట్టారు.

తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాక, ఒక రాజప్రతినిధి ఆశ్రయంలో పెరిగి పెద్ద చదువులు చదివాడు. పశువులు కాసే రోజుల్లోనే ఆకాశం వైపు చూస్తూ ‘మా జాతి ప్రజలు ఎందుకు బానిసల్లా బతకాలి?’ అని ఆలోచించేవాడు. చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న ఆ పిల్లాడే, పెద్దయ్యాక వర్ణవివక్షపై పోరాడి 27 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడై, ప్రపంచానికే ‘స్వేచ్ఛ’ అంటే ఏంటో చూపించాడు. ఆలోచన గట్టిగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దీనిని బట్టి అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement