లామాకాన్‌..కళా 'మకాన్‌'! | Lamakaan is an open cultural space in Hyderabad | Sakshi
Sakshi News home page

లామాకాన్‌..కళా 'మకాన్‌'! కళాకారులు ఎమోషనల్‌ ప్రదేశం..

Jul 5 2025 2:42 PM | Updated on Jul 5 2025 2:53 PM

Lamakaan is an open cultural space in Hyderabad

ఇల్లు కానిది.. విలువైనది.. ‘కళ’కళ లాడేది.. అదే లామకాన్‌. లామకాన్‌ అంటే ఇల్లు కానిదని అర్థం.. బంజారా హిల్స్‌ రోడ్‌ నెం–1లో వెంగళరావు పార్క్‌ సమీపంలోని గల్లీలో ఉంది ఈ ‘కళా’మకాన్‌. ఇదొక సాంస్కృతిక నిలయం. ఇక్కడ అన్ని రంగాలకు చెందినవారు, వయోభేదం లేకుండా కళాప్రియులు, యువత అధికంగా కనిపిస్తారు. లోపలికి వెళితే సినిమాలు, నాటకాల గురించి కొందరు, సంగీతం నేర్చుకుంటూ మరికొందరు, సోషల్‌మీడిమా, కార్పొరేట్‌ వ్యక్తుల బిజెనెస్‌పై ఇంకొందరు చర్చిస్తూ కనిపిస్తారు. ఇక్కడికి అన్ని రంగాల ప్రముఖులు వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటుంటారు. కళలను ప్రదర్శిస్తుంటారు. నగరవాసులతోపాటు తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశాల ప్రజలు ఇక్కడికి 
వచ్చి తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు.  

లామకాన్‌ అనేది ఒక కళాకారుడి కలల నిలయం.. నగరానికి చెందిన పెయింటర్, ఫొటోగ్రాఫర్‌ మొయిద్‌ హసన్‌ ఎంతో నచి్చ, మెచ్చి ఈ ఇల్లు నిరి్మంచుకున్నారు. ఆయన తన కళతోపాటు సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలను సైతం తీశారు. హసన్‌ జీవించినంత కాలం ఇక్కడ ఆయన కళా స్నేహితులు, సాహితీవేత్తలతో నిత్యం కళకళలాడుతుండేది. ఆయన మరణాంతరం నిలయం బోసిపోయింది. హసన్‌ జ్ఞాపకార్థం దీనిని లామకాన్‌గా మార్చారు. 
ప్రవేశం, వైఫై ఉచితం... 
లామకాన్‌లోకి ప్రవేశం, వైఫై ఉచితం. ఉదయం నుంచి రాత్రి వరకూ లామకాన్‌ సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుంది. సోమవారం సెలవుదినం. కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిర్వహణ ఖర్చును కొద్దిపాటిగా తీసుకుంటారు. సందర్శకులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ప్రదర్శనలకు టికెట్‌ను పెడతారు. ఇక్కడి క్యాంటీన్‌లో రుచికరమైన ఆహారం ధరలు అతితక్కువగా ఉంటాయి. చాలామంది యువత ఇక్కడికి క్యాంటీన్‌ ఫుడ్‌ కోసం వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటుంటారు.  

యువత మెచ్చిన ప్రాంతం..  
కళాకారులకు లామకాన్‌ ఓ ఎమోషనల్‌ ప్రదేశం. ఏదైనా ఆలోచనను పంచుకోవాలన్నా, తమ టాలెంట్‌ను చెప్పుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ, లామకాన్‌ మాత్రం వీటన్నింటికీ ప్రత్యేకం. ఈ ప్రదేశం కవి సమ్మేళనాలు, పెయింటింగ్, పుస్తకావిష్కరణ లాంటి కార్యక్రమాలకు ఉచితం. ఆలోచనలను పంచుకుంటూ ఎంతసేపైనా ఇక్కడ ఉండొచ్చు. సిటి మధ్యలో ఉండే ఈ లామకాన్‌ కళాకారులకు, యువతకు సుందర ప్రదేశం. ఇక్కడి ఫుడ్‌ కోసమే వచ్చేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో! 

ఇక్కడ సమోస, ఛాయ్, బజ్జీ, పలావ్‌లు ప్రత్యేకం. ఇక్కడ ఎంతోమంది తమ ప్రదర్శనలతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలో హనన్‌ మేనల్లుడితోపాటు మరికొంత మంది నిర్ణయిస్తారు. లామకాన్‌ పేరుకు కళంకం కాకుండా కొన్ని సమస్యాత్మక కార్యక్రమాలపై వీరు తమ అభిప్రాయాలను, అనుమతులను నిర్ణయిస్తారు. కొన్ని ఏళ్ళుగా లామకాన్‌ కళలకు నిలయంగా ఉంటూ వేలాది మందికి వేదికగా నిలిచింది.  

(చదవండి: Droupadi Murmu: వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement