breaking news
Lamakan
-
లామాకాన్..కళా 'మకాన్'!
ఇల్లు కానిది.. విలువైనది.. ‘కళ’కళ లాడేది.. అదే లామకాన్. లామకాన్ అంటే ఇల్లు కానిదని అర్థం.. బంజారా హిల్స్ రోడ్ నెం–1లో వెంగళరావు పార్క్ సమీపంలోని గల్లీలో ఉంది ఈ ‘కళా’మకాన్. ఇదొక సాంస్కృతిక నిలయం. ఇక్కడ అన్ని రంగాలకు చెందినవారు, వయోభేదం లేకుండా కళాప్రియులు, యువత అధికంగా కనిపిస్తారు. లోపలికి వెళితే సినిమాలు, నాటకాల గురించి కొందరు, సంగీతం నేర్చుకుంటూ మరికొందరు, సోషల్‌మీడిమా, కార్పొరేట్ వ్యక్తుల బిజెనెస్‌పై ఇంకొందరు చర్చిస్తూ కనిపిస్తారు. ఇక్కడికి అన్ని రంగాల ప్రముఖులు వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటుంటారు. కళలను ప్రదర్శిస్తుంటారు. నగరవాసులతోపాటు తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. లామకాన్ అనేది ఒక కళాకారుడి కలల నిలయం.. నగరానికి చెందిన పెయింటర్, ఫొటోగ్రాఫర్ మొయిద్ హసన్ ఎంతో నచి్చ, మెచ్చి ఈ ఇల్లు నిరి్మంచుకున్నారు. ఆయన తన కళతోపాటు సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలను సైతం తీశారు. హసన్ జీవించినంత కాలం ఇక్కడ ఆయన కళా స్నేహితులు, సాహితీవేత్తలతో నిత్యం కళకళలాడుతుండేది. ఆయన మరణాంతరం నిలయం బోసిపోయింది. హసన్ జ్ఞాపకార్థం దీనిని లామకాన్గా మార్చారు. ప్రవేశం, వైఫై ఉచితం... లామకాన్లోకి ప్రవేశం, వైఫై ఉచితం. ఉదయం నుంచి రాత్రి వరకూ లామకాన్ సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుంది. సోమవారం సెలవుదినం. కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిర్వహణ ఖర్చును కొద్దిపాటిగా తీసుకుంటారు. సందర్శకులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ప్రదర్శనలకు టికెట్‌ను పెడతారు. ఇక్కడి క్యాంటీన్లో రుచికరమైన ఆహారం ధరలు అతితక్కువగా ఉంటాయి. చాలామంది యువత ఇక్కడికి క్యాంటీన్ ఫుడ్ కోసం వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటుంటారు. యువత మెచ్చిన ప్రాంతం.. కళాకారులకు లామకాన్ ఓ ఎమోషనల్ ప్రదేశం. ఏదైనా ఆలోచనను పంచుకోవాలన్నా, తమ టాలెంట్‌ను చెప్పుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ, లామకాన్ మాత్రం వీటన్నింటికీ ప్రత్యేకం. ఈ ప్రదేశం కవి సమ్మేళనాలు, పెయింటింగ్, పుస్తకావిష్కరణ లాంటి కార్యక్రమాలకు ఉచితం. ఆలోచనలను పంచుకుంటూ ఎంతసేపైనా ఇక్కడ ఉండొచ్చు. సిటి మధ్యలో ఉండే ఈ లామకాన్ కళాకారులకు, యువతకు సుందర ప్రదేశం. ఇక్కడి ఫుడ్ కోసమే వచ్చేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో! ఇక్కడ సమోస, ఛాయ్, బజ్జీ, పలావ్‌లు ప్రత్యేకం. ఇక్కడ ఎంతోమంది తమ ప్రదర్శనలతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలో హనన్ మేనల్లుడితోపాటు మరికొంత మంది నిర్ణయిస్తారు. లామకాన్ పేరుకు కళంకం కాకుండా కొన్ని సమస్యాత్మక కార్యక్రమాలపై వీరు తమ అభిప్రాయాలను, అనుమతులను నిర్ణయిస్తారు. కొన్ని ఏళ్ళుగా లామకాన్ కళలకు నిలయంగా ఉంటూ వేలాది మందికి వేదికగా నిలిచింది. (చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...) -
‘పర్సనల్ సేఫ్టీ’పై అవగాహన
పిల్లలు, పెద్దలకు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగించేందుకు ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్‌లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలోచనా విధానాలు, యంత్రాంగాలు ఇలా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించనున్నారు. పిల్లల భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్న టీనేజర్, యంగ్‌స్టర్, పేరెంట్స్ అందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చని కార్యక్రమ నిర్వాహకులు మిహిరా అపరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. తబలా క్లాసెస్ సుహాస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి 11 వరకు బంజారాహిల్స్ లామకాన్‌లో తబలా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. -
ఐఓఈ
మారుతున్న జీవన పరిస్థితులతో పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. అన్నింటికీ ఆధారభూతమైన ఈ భూమండలం మనం సృష్టించే కాలుష్యం దెబ్బకు ఉక్కిరిబిక్కిరవుతోంది. పర్యావరణాన్ని రక్షించుకొంటే గానీ మనుగడకు ముప్పు తప్పదనే సందేశంతో ప్రదర్శించే నాటకం ‘ఐఓఈ: ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది ఎర్త్’. మలయాళం రచయిత వైకోమ్ మహమ్మద్ బషీర్ రాసిన పొట్టి కథ ‘భూమియూడె అవకాషికల్’ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు. క్యారెక్టర్లతో పాటు పపెట్స్, మాస్క్స్, మల్టీమీడియా వంటివి కూడా ఈ ప్లేలో భాగం పంచుకుంటాయి. ఇందులో ఉపయోగించే మెటీరియల్స్ అన్నీ ఓ రీసెర్చ్ వర్క్‌షాప్‌లో ఈ థియేటర్ గ్రూప్ మెంబర్స్ సొంతంగా తయారు చేసినవే. ఓ గ్రామ, నగర బాహ్య, అంతర జీవన గమన తీరును చూపే ప్రయత్నం ఇది. యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ నాటకాన్ని ధరిత్రీ దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన థియేటర్ హట్... ‘బీ 4.48 థియేటర్’ గ్రూప్ ప్రదర్శిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల సమాహారం థియేటర్ హట్. ఎన్నో రకాల కల్చరల్, థియేటర్ వర్క్‌షాప్స్ నిర్వహించింది. వేదిక: లామకాన్, బంజారాహిల్స్ సమయం: గురువారం రాత్రి 8 గంటలకు, ఎంట్రీ పాస్‌ల కోసం ఫోన్: 9676145161