Kitchen Tips: Ginger Garlic Paste Recipe - Sakshi
Sakshi News home page

Kitchen Tips: అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది

Jul 6 2023 3:43 PM | Updated on Jul 21 2023 7:33 PM

Kitchen Tips: How To Cook Tasty And Easy With Simple Hacks - Sakshi

రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ  చిట్కాలు పాటిస్తే సరి...
కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది.

♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్‌ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్‌ బాల్‌ను వెనీలా ఎసెన్స్‌లో ముంచి, రిఫ్రిజిరేటర్‌లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది.

♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.  

Advertisement
 
Advertisement
Advertisement