స్ఫూర్తి
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా భవాని బాధ్యతలు స్వీకరించినప్పుడు విద్యార్థుల సంఖ్య నలభై! ‘ఎంతమంది అయితే నాకేమిటి! వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్లామా’ అని అనుకోలేదు ఆమె. ఆరోజు నుంచే, విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి... అనేదాని గురించి ఆలోచించారు. విద్యాబోధనలో ఎన్నో సృజనాత్మక మార్గాలను ప్రవేశ పెట్టారు. ఎంతో మంది పిల్లలను బడికి దగ్గరకు చేశారు. విద్యార్థుల సంఖ్యను 40 నుంచి 135కి పెంచారు. తన కృషికి గుర్తింపుగా బోంపెల్లి భవాని తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు...
గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఆధునిక హంగులు కల్పించారు భవాని. పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో బడి రూపురేఖలు మార్చారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే వారు చదువుపై శ్రద్ద పెడతారనే ఉద్దేశంతో ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. రకరకాల రంగుల బొమ్మలతో పాఠశాల గోడలను ముస్తాబు చేయించారు. ప్రైవేట్ స్కూల్‌కు దీటుగా తీర్చిదిద్దారు. కృత్యాధార బోధనకు సంబంధించి వీడియోలను రూ΄÷ందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. వాటిని లక్షలాది మంది చూసి అభినందిస్తుంటారు.
తమ పాఠశాలలో కూడా వాటిని అనుసరిస్తుంటారు.

ఆహా మాత్రమే కాదు... ఆచరణలోకి! గతంతో పోల్చితే విద్యాబోధనకు సంబంధించి ఎన్నో సృజనాత్మక విధానాలు, సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. వాటి గురించి విని, చదివి ‘ఆహా’ అనుకోవడానికే పరిమితం అవుతారు చాలామంది. భవానీ మాత్రం ‘ఆహా’ అనుకోవడానికే పరిమితం కాలేదు. తనకు తెలిసిన సరికొత్త బోధన పద్ధతులు బడిలోకి అడుగు పెట్టేలా చేశారు.
‘‘ఏ ప్రయత్నం చేయనప్పుడే నిరాశ దరి చేరుతుంది. ఏ చిన్న ప్రయత్నం చేసినా ఆశాదీపం వెలుగుతుంది’’ అనే ఎరుకతో విద్యార్థులను బడికి వచ్చేలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు భవాని. ్లే వే మెథడ్‌లో బోధన... ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆడుతూ, పాడుతూ చెబుతుంటే సులువుగా అర్థం చేసుకుంటారు. రకరకాల మెటీరియల్స్ తయారు చేసి వాటì ద్వారా పిల్లలకు బోధిస్తాను. బట్టీ పడితే నాలుగు రోజులే గుర్తుంటుంది.
ఆడుతూ, పాడుతూ నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. అందుకే నేను పిల్లలకు అన్ని రకాలుగా బోధన చేస్తూ వారిని తీర్చిదిద్దుతున్నాను. నాకు గత ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వచ్చింది. ప్రభుత్వం ఫిన్లాండ్ విద్యా విధానంపై అధ్యయనానికి పంపిన బృందంలో నేనూ ఒకరిని. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫిన్లాండ్‌లో విద్యావిధానాన్ని అధ్యయనం చేసి వచ్చాము. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో అక్కడి విద్యావిధానం గురించి వివరించాం’ అంటున్నారు భవాని.
ఆ పరిస్థితి రాకుండా... భవాని చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుల కొరత ఉండేది. తరగతి గదుల కొరత ఉండేది. స్కూల్, కాలేజీ ఒకే భవనంలో నిర్వహించేవారు. ఒక పూట స్కూల్, ఒక పూట కాలేజీ... షిఫ్ట్‌ల వారీగా తరగతులు జరిగేవి! ఒక్కమాటలో చెప్పాలంటే... సౌకర్యాల నుంచి విద్యాబోధన వరకు చాలా సమస్యలు ఉండేవి. అలాంటి సమస్యలేవీ ఈతరం పిల్లలకు ఎదురుకాకూడదనే లక్ష్యంతో నడుం కట్టారు భవాని. ఉపాధ్యాయురాలిగా కోమటిపల్లిలో తొలి పోస్టింగ్ నుంచి గాంధారీ పాఠశాలలో అడుగు పెట్టే క్షణం వరకు వృత్తినిబద్ధతను చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నారు భవాని.
బాధ్యత మరింత పెరిగింది
తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యతను మరింతగా పెంచినట్టుగా అనిపిస్తోంది. ఈ గుర్తింపు నా ఒక్కదానిదే కాదు. నన్ను నమ్మి తమ పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, అధికారులందరిదీ. భవిష్యత్‌లో మరింత కష్టపడి పనిచేస్తాను.
– బోంపెల్లి భవాని
– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి


