breaking news
national best teacher award winner
-
భావితరాలకు బాసటగా...
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా భవాని బాధ్యతలు స్వీకరించినప్పుడు విద్యార్థుల సంఖ్య నలభై! ‘ఎంతమంది అయితే నాకేమిటి! వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్లామా’ అని అనుకోలేదు ఆమె. ఆరోజు నుంచే, విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి... అనేదాని గురించి ఆలోచించారు. విద్యాబోధనలో ఎన్నో సృజనాత్మక మార్గాలను ప్రవేశ పెట్టారు. ఎంతో మంది పిల్లలను బడికి దగ్గరకు చేశారు. విద్యార్థుల సంఖ్యను 40 నుంచి 135కి పెంచారు. తన కృషికి గుర్తింపుగా బోంపెల్లి భవాని తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు...గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఆధునిక హంగులు కల్పించారు భవాని. పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో బడి రూపురేఖలు మార్చారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే వారు చదువుపై శ్రద్ద పెడతారనే ఉద్దేశంతో ఆమె చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. రకరకాల రంగుల బొమ్మలతో పాఠశాల గోడలను ముస్తాబు చేయించారు. ప్రైవేట్ స్కూల్‌కు దీటుగా తీర్చిదిద్దారు. కృత్యాధార బోధనకు సంబంధించి వీడియోలను రూ΄÷ందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. వాటిని లక్షలాది మంది చూసి అభినందిస్తుంటారు.తమ పాఠశాలలో కూడా వాటిని అనుసరిస్తుంటారు.ఆహా మాత్రమే కాదు... ఆచరణలోకి! గతంతో పోల్చితే విద్యాబోధనకు సంబంధించి ఎన్నో సృజనాత్మక విధానాలు, సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. వాటి గురించి విని, చదివి ‘ఆహా’ అనుకోవడానికే పరిమితం అవుతారు చాలామంది. భవానీ మాత్రం ‘ఆహా’ అనుకోవడానికే పరిమితం కాలేదు. తనకు తెలిసిన సరికొత్త బోధన పద్ధతులు బడిలోకి అడుగు పెట్టేలా చేశారు. ‘‘ఏ ప్రయత్నం చేయనప్పుడే నిరాశ దరి చేరుతుంది. ఏ చిన్న ప్రయత్నం చేసినా ఆశాదీపం వెలుగుతుంది’’ అనే ఎరుకతో విద్యార్థులను బడికి వచ్చేలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు భవాని. ్లే వే మెథడ్‌లో బోధన... ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆడుతూ, పాడుతూ చెబుతుంటే సులువుగా అర్థం చేసుకుంటారు. రకరకాల మెటీరియల్స్ తయారు చేసి వాటì ద్వారా పిల్లలకు బోధిస్తాను. బట్టీ పడితే నాలుగు రోజులే గుర్తుంటుంది. ఆడుతూ, పాడుతూ నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. అందుకే నేను పిల్లలకు అన్ని రకాలుగా బోధన చేస్తూ వారిని తీర్చిదిద్దుతున్నాను. నాకు గత ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వచ్చింది. ప్రభుత్వం ఫిన్లాండ్ విద్యా విధానంపై అధ్యయనానికి పంపిన బృందంలో నేనూ ఒకరిని. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫిన్లాండ్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేసి వచ్చాము. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో అక్కడి విద్యావిధానం గురించి వివరించాం’ అంటున్నారు భవాని.ఆ పరిస్థితి రాకుండా... భవాని చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుల కొరత ఉండేది. తరగతి గదుల కొరత ఉండేది. స్కూల్, కాలేజీ ఒకే భవనంలో నిర్వహించేవారు. ఒక పూట స్కూల్, ఒక పూట కాలేజీ... షిఫ్ట్‌ల వారీగా తరగతులు జరిగేవి! ఒక్కమాటలో చెప్పాలంటే... సౌకర్యాల నుంచి విద్యాబోధన వరకు చాలా సమస్యలు ఉండేవి. అలాంటి సమస్యలేవీ ఈతరం పిల్లలకు ఎదురుకాకూడదనే లక్ష్యంతో నడుం కట్టారు భవాని. ఉపాధ్యాయురాలిగా కోమటిపల్లిలో తొలి పోస్టింగ్ నుంచి గాంధారీ పాఠశాలలో అడుగు పెట్టే క్షణం వరకు వృత్తినిబద్ధతను చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నారు భవాని. బాధ్యత మరింత పెరిగిందితెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యతను మరింతగా పెంచినట్టుగా అనిపిస్తోంది. ఈ గుర్తింపు నా ఒక్కదానిదే కాదు. నన్ను నమ్మి తమ పిల్లల్ని బడికి పంపుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, అధికారులందరిదీ. భవిష్యత్‌లో మరింత కష్టపడి పనిచేస్తాను.– బోంపెల్లి భవాని– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మృతి.. ఉపాధ్యాయ సంఘాలు సంతాపం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని బాదేపల్లికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు కె.వేణుగోపాల్ (75) బుధవారం మృతి చెందారు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా దివంగత అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అదేవిధంగా 30ఏళ్ల పాటు ఎస్టీయూ సంఘం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. మున్సిపాలిటీలోని నేతాజీ చౌరస్తాలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రతిష్ఠించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. బాదేపల్లి శాఖ గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేశారు. జడ్చర్లలో జరిగిన అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విద్యార్థులను సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించే వారు. ఆయన మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం బాదేపల్లిలో నిర్వహించనున్నారు. -
రాష్ట్రం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులకు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023కుగాను ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించారు. ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన అర్చన నూగురి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ భేడోద్కర్‌లు అవార్డులు అందుకోగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్–ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ అందించే ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీలో హైదరాబాద్ ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీ నుంచి ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో నెల్లూరుకు చెందిన మేకల భాస్కర్‌రావు, విశాఖపట్నం శివాజీ పాలెంకు చెందిన మురహరరావు ఉమా గాంధీ, రాయచోటికి చెందిన సెట్టెం ఆంజనేయులు అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పాల్గొన్నారు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కుమారస్వామి
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ఆత్మకూరు మండలం దామెర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసు కుమారస్వామి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ఎడ్యుకేషన్ డెరైక్టర్ నుంచి ఆయనకు లేఖ అందింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా కుమారస్వామి అవార్డు అందుకోనున్నారు. ములుగు మండల కేంద్రానికి చెందిన దాసు కుమారస్వామి మొదటిసారిగా అక్టోబర్1, 1986లో ములుగు పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చే రారు. నవంబర్26, 2005లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ము లుగు, మరిపెడ, వెంకటాపూర్ మండలాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆత్మకూరు మండలం దామెర పాఠశాలలో పని చేస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం వినూత్నరీతిలో కరపత్రాలు, డోర్పోస్టర్లతో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన పనిచేస్తున్న పాఠశాలలో 1నుండి 5తరగతుల్లో 300మంది విద్యార్థులు ఉన్నారు. దాతల సహకారంతో ఇక్కడి విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్టులు, బ్యాడ్జ్‌లు, పలకలు, నోటుపుస్తకాలు, డైరీలు పంపిణీ చేశారు. అదేవిధంగా *50వేలతో పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించారు. అందుకున్న అవార్డులెన్నో... కుమారస్వామి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల నుంచి ఎ న్నో అవార్డులు అందుకున్నారు. 2007, 2010లో జిల్లా ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డులు, 2011లో రాష్ట్ర ఉత్తమ ఉ పాధ్యాయ అవార్డు అందుకున్నారు. తాజాగా ఇప్పుడు జా తీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. అ లాగే ఎల్ఐసీ, లయన్స్‌క్లబ్, మదర్‌థెరిస్సా ఫౌండేషన్, అ చీవర్స్ ఆర్గనైజేషన్, సర్వేపల్లి రాధాకృష్ణ ఫౌండేషన్ల నుంచి కూడా అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అవార్డు పాఠశాలకే అంకితం : కుమారస్వామి నాకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పా ఠశాలకే అంకితం ఇస్తున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయుల కృషితోనే ఈ అవార్డు నాకు దక్కిం ది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. ప్రభు త్వ ఉపాధ్యాయుల మీద ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తాను


