క్రిస్‌మస్‌ ఎనర్జీ | Jacqueline Fernandez and Shraddha Kapoor remembers Christmas celabrations | Sakshi
Sakshi News home page

క్రిస్‌మస్‌ ఎనర్జీ

Dec 24 2023 4:52 AM | Updated on Dec 24 2023 4:52 AM

Jacqueline Fernandez and Shraddha Kapoor remembers Christmas celabrations - Sakshi

క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించి బాలీవుడ్‌ సెలబ్స్‌ సందడి సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌ ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్‌మస్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్‌మస్‌ తన ఫేవరెట్‌ ఫెస్టివల్‌ అని చెబుతోంది బాలీవుడ్‌ కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ‘క్రిస్‌మస్‌కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది.

నా క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌ ఎక్కువగా బహ్రెయిన్‌లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్‌కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్‌ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్‌ సో కూల్‌ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్‌. ‘క్రిస్‌మస్‌ ఎనర్జీ’ పేరుతో క్రిస్‌మస్‌ జ్ఞాపకాల ఫోటోలను సోషల్‌ మీడియా లో షేర్‌ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement