కంటి రెప్పవెనుక పన్ను..! వైద్యులనే ఆశ్చర్యపరిచిన అరుదైన కేసు | Indian Teen With Tooth Growing Inside His Eye | Sakshi
Sakshi News home page

కంటి రెప్పవెనుక పన్ను..! వైద్యులనే ఆశ్చర్యపరిచిన అరుదైన కేసు

Oct 19 2026 10:16 AM | Updated on Oct 19 2026 10:16 AM

Indian Teen With Tooth Growing Inside His Eye

నిజానికి కొందరికి దంతాలు నోటిలో ఎగుడు దిగుడుగా, అంగుడికి లేదా నోటి కుహరంలోనూ వస్తుండటం చూసుంటాం. అసలు అలా ఇలా కాకుండా ఓ వ్యక్తికే ఏకంగా కంటిలో మొలిచాయి దంతాలు. వైద్య శాస్త్రానికి అంతు చిక్కని మిస్టరీలా నిలిచింది ఈ అరుదైన కేసు. 

ఈ వింత ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. అక్కడ 16 ఏళ్ల బాలుడు తన ఎడమ కంటిపై వింతగా, నొప్పి లేకుండా వాపు రావడంతో వైద్యులను ఆశ్రయించాడు. మొదట తేలికపాటి గడ్డలా అనిపించింది వైద్యులకు. ఆ తర్వాత కొద్దిరోజులకే కనురెప్ప వెనుక నుంచి చర్మం చీల్చుకుని రెండు గట్టి తెల్లటి మొనలు రావడం ప్రారంభించాయి. వైద్యులు కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ చేసి చూడగా.. కంటి గుంట పై భాగంలో రెండు దంతాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. 

ఇలాంటి విచిత్రమైన కేసు ఇదే మొట్టమొదటిదని అన్నారు. ఇలా కంటి పైభాగంలో పన్ను రావడాన్ని ఎక్టోపిక్‌ టూత్‌ అంటారు. ఇది నోటిలో కాకుండా తప్పుడు ప్రదేశంలో పెరిగే దంతం. ఇలా కంటి పైభాగంలో ఎక్టోపిక్‌ టూత్‌ వచ్చిన ఏకైక కేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. సాధారణం దంతాలు నాసికా కుహరం, నోటి పైకప్పుపై రావడం చూశాం కానీ ఇలా విచిత్రంగా కంటి గుంతలో రావడం అత్యంత విచిత్రమని అన్నారు. గతంలో జరిగిన గాయాల కారణంగా ఇలాంటి అరుదైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. 

అయితే ఆ బాలుడికి గాయాలు, జన్యుపరమైన రుగ్మతలు ఏమి లేకపోవడంతో విజయవంతంగా సర్జీరీ చేసి ఆ రెండు పన్నులను తొలగించారు. అలాగే అతడి పుర్రెలో మరెక్కడా అదనపు దంతాలు కనిపంచలేదని తెలిపారు వైద్యులు. ఇక సదరు బాలుడికి కంటి పైభాగంలో వాపు కూడా నయం అయిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇది మొట్టమొదటి అరుదైన కేసుగా అభివర్ణిస్తున్నారు వైద్యులు. అంతేగాదు వైద్యశాస్త్రంలోనే అత్యంత విభిన్నమైన మిరాకిల్‌ కేసుగా పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: ఈ 101 ఏళ్ల తాతగారి ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకవ్వుతారు..! ఇప్పటికీ కోక్‌, స్ప్రైట్‌..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement