
ఇండియన్ ఐడల్ స్టార్ సాయిలి కాంబ్లే తల్లి కాబోతోంది. ఈ గుడ్ న్యూస్‌ను తన భర్త ధవాల్‌తో కలిసి అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితాల్లోకి అద్భుతం రాబోతోందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అంతేకాదు దీనిక సంబంధించి బేబీ షవర్ ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. త్వరలోనే ఈ స్టార్ సింగర్ లాలి పాటలు పాడబోతోందంటూ అభిమానులు, తోటి కళాకారులు ఆమెకు అభినందనలు అందించారు.
మెటర్నిటీ ఫోటో షూట్‌లో సాయిలి సాంప్రదాయ మహారాష్ట్ర స్టైల్‌లో ఆకుపచ్చ. నారింజ రంగు చీరలో మెరుస్తూ కనిపించింది.లుక్‌ను పూర్తి అందమైన రాణిహార్, కమర్బంధ్, మాంగ్ టీక చెవిపోగులతో తన లుక్‌మరింత అందంగా మల్చుకుంది. భార్యకు తగ్గట్టుగా ధవల్ తనదైన శైలిలో ముస్తాబయ్యారు.
"మా హృదయాలు ఆనందం మరియు నిరీక్షణతో ఉప్పొంగిపోతున్నాయి! మా చిన్న అద్భుతం రాబోతోంది. చాలా సంతోసం. జీవితంలో అత్యంత అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభిస్తున్నాం. మరింత ద్విగుణీకృతమైన ఆనంద క్షణాలను అనుభవించేందుకు ఎదురు చూస్తున్నాం. 'కొంచెం స్టార్‌డస్ట్, కొంచెం స్వర్గం , జీవితానికి సరిడా ప్రేమ మా దారిలోకి వస్తున్నాయి.’ అంటూ పోస్ట్ చేశారు.
కాగాఇండియన్ ఐడల్ సీజన్ 12లో తన అద్భుతమైన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న గాయని సాయిలీ. సాయిలీ తన చిరకాల ప్రియుడు ధవల్‌ను 2022, ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది.
చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్