నో స్ట్రింగ్స్‌ కాఫీ ఫెస్టివల్‌.. | The Indian Coffee Festival in Hyderabad | Sakshi
Sakshi News home page

నో స్ట్రింగ్స్‌ కాఫీ ఫెస్టివల్‌..

Sep 14 2024 8:27 AM | Updated on Sep 14 2024 10:02 AM

The Indian Coffee Festival in Hyderabad

నగరంలో తొలిసారిగా ‘ది ఇండియన్‌ కాఫీ’

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన నో స్ట్రింగ్స్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ ప్రియుల కోసం నగరంలో తొలిసారిగా ది ఇండియన్‌ కాఫీ ఫెస్టివల్‌ కొలువుదీరింది. జూబ్లీహిల్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటైన ఈ ఫెస్ట్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆసియాలోనే తొలి కాఫీ మహిళగా పేరొందిన సునాలిని మీనన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ ఫెస్టివల్‌లో భాగంగా కాఫీ ఆర్ట్‌ సెషన్స్, బరిస్తా డిస్‌ప్లే, నిపుణుల చర్చలు.. తదితర విశేషాంశాలకు చోటు కల్పించారు. అదే విధంగా కుటుంబాలు, చిన్నారులు, పెట్స్‌ కోసం విభిన్న రకాల ఈవెంట్స్‌ కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.  కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్‌ కాఫీ, బిగ్‌ స్టార్‌ కేఫ్, అరకు కాఫీ, ఎంఎస్‌పీ హిల్‌ రోస్టర్స్‌.. తదితర ప్రముఖ బ్రాండ్లన్నీ కొలువుదీరాయి. ఈ ఫెస్టివల్‌ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement