3 టిఫిన్ల బిల్లు రూ.795 | Went to CTR last night and the dosa prices nearly gave me a heart attack | Sakshi
Sakshi News home page

3 టిఫిన్ల బిల్లు రూ.795

Oct 13 2026 7:39 AM | Updated on Oct 13 2026 7:39 AM

Went to CTR last night and the dosa prices nearly gave me a heart attack

యశవంతపుర: బెంగళూరులో కొన్ని హోటళ్లలో కాఫీ, టిఫిన్ల రేట్లు భగ్గుమంటాయి. సామాన్య, మధ్యతరగతి జనం ఆ ధరలను భరించలేరు. ఓ యూట్యూబర్‌ ఇది తెలియక అలాంటి హోటల్‌కు వెళ్లి నోరెళ్లబెట్టాడు. 3 టిఫిన్లకు రూ.795 బిల్‌ వేశారని, ఇది న్యాయమా? అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. 

కేసరిబాత్, వెన్న మసాల దోసె, మా­మూలు దోసెకు ఇంత మొత్తం వసూలు చేశారని తెలిపాడు. బెంగళూరు కెంపేగౌడ విమానశ్రయంలోని హోటల్‌లు తిన్నట్లు తెలిపాడు. బయట హోటల్స్‌ కంటే విమానాశ్రయంలోని క్యాంటీన్లలో ధరలు ఎక్కువ అని నెటిజన్లు అతన్ని బుజ్జగించారు. రూ.300లతో పోయేదానికి ఎక్కువే ఖర్చు పెట్టావని మరికొందరు నిట్టూర్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement