
బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా పింక్ పవర్ రన్ ఆదివారం నిర్వహించారు. ఈ మారథాన్‌లో ప్రపంచ సుందరీమణులు, సినీ ప్రముఖులు, అధికారులు, వృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ నిర్వహించారు. రన్‌లో పాల్గొనే వారికి అంతర్జాతీయ ఫిట్నెస్ నిపుణులు మెళకువలు నేర్పించారు. గత సంవత్సరం 10వేల మంది పాల్గొనగా.. ఈ యేడాది 20వేల మంది పింక్ పవర్ రన్‌లో పాల్గొన్నారు.
మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పింక్ పవర్ రన్‌ను మిస్ వరల్డ్ –2025 ఓపల్ సుచాత, మిస్ ఆసియా కృష్ణ, ఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మపర్సన్ సుధారెడ్డి పలువురు ప్రముఖులతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు. కేన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పది కిలోమీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తిచేసిన ముగ్గురు మహిళలకు ట్రోఫీలతో పాటు ప్రైజ్ మనీ అందజేశారు.
బ్రెస్ట్ కేన్సర్ అవగాహన రన్‌లో పాల్గొన్న ఏడు సంవత్సరాల పార్వతి, ఐదు కిలోమీటర్ల విభాగంలో ఐదు సంవత్సరాల కబీర్ సింగ్, వీల్ చైర్‌తో పాల్గొన్న నంద కిషోర్ అనే యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రన్‌లో పాల్గొన్న వారితో నెక్లెస్ రోడ్డు గులాబీ వర్ణంతో నిండిపోయింది.
ప్రముఖుల సందడి..
మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్పాస్ట్రక్చర్ లిమిటెడ్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ మారథాన్‌లో అంతర్జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకరుడు లియాండర్ ఫేస్, ప్రముఖ సినీ నటుడు బ్రహా్మనందం, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, సీరియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జ్యోషి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ జూలియా, పీవీ కృష్ణారెడ్డితో పాటు అధికారులు, ప్రముఖులు రన్‌లో పాల్గొన్నారు.
(చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..)