మూత్రపిండం ప్రాణగండం | Health Tips: Kidney Disease Stages Risks and Real Life Experiences | Sakshi
Sakshi News home page

మూత్రపిండం ప్రాణగండం

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 4:10 PM

Health Tips: Kidney Disease Stages Risks and Real Life Experiences

మన దేహంలో మూత్రపిండాలు (కిడ్నీలు) ప్రతి క్షణం మన రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అవి రక్తంలోని విషపదార్థాలనూ, వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి. ఈ కండిషన్‌నే ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజరీ’ (ఏకేఐ) అంటారు. ఇది కొంత ప్రమాదకరమైన పరిస్థితే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో బాధితులకు తగిన చికిత్స అందక΄ోతే కొన్ని గంటలు లేదా రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ మెడికల్‌ ఎమర్జెన్సీ కండిషన్‌ ఎప్పుడు ఏర్పడుతుంది, దీనికి కారణాలేమిటి, దీనికి నివారణ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.

కొంతమందిలో యూరిన్‌ పాస్‌ చేస్తున్న సమయంలో మూత్రం తక్కువగా రావడం జరుగుతుండవచ్చు. అలా మూత్రం పరిమాణం తగ్గడం అంత మంచి సూచన కాదు. అలాగే దేహంలో ముఖం లేదా కాళ్లూ చేతుల్లో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్‌) వంటి లక్షణాలను చిన్న సమస్యగానే అనుకుని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశమూ ఉంది. అయితే ఈ లక్షణాలన్నీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే తొలి సంకేతాలు కావచ్చు. సమయానికి చికిత్స తీసుకోక΄ోతే దేహంలో విషపదార్థాలు పేరుకు΄ోయి గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ ఉంటుంది. 

చికిత్స ఇలా... అక్యూట్‌ కిడ్నీ ఇంజరీ (ఏకేఐ)కి కారణమైన సమస్యను వెంటనే గుర్తించి, దానికి తక్షణ చికిత్స అందించడమన్నది ఏకేఐ చికిత్సలో అత్యంత కీలకం. ఉదాహరణకు డీ–హైడ్రేషన్‌ వల్ల దేహంలో ద్రవాలు తగ్గితే వెంటనే సెలైన్‌ ఎక్కించడం ద్వారా శరీరంలో నీటిమోతాదు సమతుల్యంగా ఉండేలా చూడాలి. 

అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్‌ కారణంగా ఈ ముప్పు వాటిల్లినట్టు తెలిస్తే దాన్ని తగ్గించడం కోసం అవసరమైన చికిత్స ఇవ్వడం, కిడ్నీలకు హానికరమైన మందులను నిలిపివేయడం, అవసరమైతే తాత్కాలికంగా డయాలసిస్‌ చేయడం ద్వారా కిడ్నీలు తిరిగి కోలుకునేలా చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే... ఏకేఐలో అందుకు కారణాన్ని బట్టి తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. 

చివరగా... మూత్రం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం చిన్న విషయం కాదు. అది కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని దేహం ఇస్తున్న హెచ్చరిక కావచ్చు. అక్యూట్‌ కిడ్నీ ఇంజరీ సమస్యను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలనూ... ఒక్కోసారి ప్రాణాలనూ కాపాడుకోవచ్చని గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ దొనకొండ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌ – 
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌

(చదవండి: హాట్‌ వర్సెస్‌ ఐస్‌ ప్యాక్‌: ఎలాంటప్పుడు మంచిదంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement