
అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం 2025 సందర్భంగా, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్( HCL Tech) ఒకవిశిష్ట కార్యక్రమాన్ని చేపట్టింది. సామాజిక బాధ్యతలో భాగంగా HCL Foundation నేతృత్వంలో భారతదేశంలోని ఆరు రాష్ట్రాలలో - ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా , పశ్చిమ బెంగాల్ - తీరప్రాంత శుభ్రపరిచే ప్రచారానికి నాయకత్వం వహించింది.
అంతర్జాతీయ తీరప్రాంతాలను శుభ్రపరిచే దినోత్సవం 2025ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో స్థానికులు, HCL Tech ఉద్యోగులు , భాగస్వామ్య సంస్థలను సమీకరించింది, ఫలితంగా 5 వేలకు పైగా వాలంటీర్లు సుమారు 20 వేల కిలోల సముద్ర వ్యర్థాలను తొలగించారు. భారతదేశంలోని తీరప్రాంత, సముద్ర పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ తననిబద్ధతను పునరుద్ఘాటించింది.
ఈ సంవత్సరం ప్రచారం యానిమల్ వెల్ఫేర్ కన్జర్వేషన్ సొసైటీ, రీఫ్‌వాచ్ మెరైన్ కన్జర్వేషన్, స్పాండన్, MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎన్విరాన్‌మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, డెవలప్‌మెంట్ రీసెర్చ్ కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ సెంటర్, Plan@tEarth, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ట్రస్, ట్రీ ఫౌండేషన్ వంటి ప్రముఖ పర్యావరణ సంస్థలతో సహకారం అందించారు. గత నాలుగేళ్ల కాలంలో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ దాని భాగస్వాములు భారతదేశ తీరప్రాంత జలాల నుండి 5లక్షల 6వేల కొలో పైగా గోస్ట్ నెట్స్, సముద్ర శిధిలాలను విజయవంతంగా తొలగించారు.
2024లో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ది హాబిటాట్స్ ట్రస్ట్ (THT) భారతదేశ సముద్ర జీవవైవిధ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే ఉద్దేశంతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయడం,సముద్ర పరిరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
స్థితిస్థాపకమైన మరియు సమ్మిళిత సమాజాలను నిర్మించాలనే మా లక్ష్యంలో పర్యావరణ స్థిరత్వం ప్రధానమైందని HCLTech గ్లోబల్ CSR SVP, HCLFoundation డైరెక్టర్ డాక్టర్ నిధి పుంధీర్ అన్నారు." మన తీరప్రాంత శుభ్రపరిచే చొరవ వ్యర్థాల తొలగింపునుకు మించి ఉంటుంది - ఇది సమిష్టి బాధ్యతను గుర్తు చేస్తుంది. పర్యావరణ నిర్వహణ సంస్కృతిని పెంపొందిస్తుంది. మా భాగస్వామ్యాల ద్వారా, భారతదేశ సముద్ర పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి, పునరుద్ధరించడానికి మేము ప్రయత్నాలను బలోపేతం చేస్తున్నామన్నారు.
అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని సెప్టెంబర్ మాసంలోని మూడవ శనివారం జరుపు కుంటారు. సముద్రపు చెత్త సమస్య గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. ఇది బీచ్‌లు, తీర ప్రాంతాలు, నదులు, మడుగులు మరియు ఇతర జలమార్గాలపై స్థానిక శుభ్రపరిచే చర్యలను ప్రోత్సహించే ప్రపంచవ్యాప్త కార్యక్రమం.