బిర్యానీ తిన్నామంటే గోలీ సోడా పడాల్సిందే.. | Goli Soda Craze In Hyderabad | Sakshi
Sakshi News home page

బిర్యానీ తిన్నామంటే గోలీ సోడా పడాల్సిందే..

Aug 10 2024 11:31 AM | Updated on Aug 10 2024 11:31 AM

 Goli Soda Craze In Hyderabad

హే బాబూ.. ఓ గోలీ సోడా కొట్టవోయ్‌.. ఈ మాట విని ఎన్నేళ్లవుతుందో కదా..! ఒకప్పుడు ప్రతి ఊర్లో.. ప్రతి వీధిలో బండిపై గోలీ సోడా అమ్ముతుండేవారు. ఎండాకాలం వచి్చందంటే చాలు అలా గోలీ సోడా ఒకటి కడుపులో పడిందంటే ఎంతో హాయిగా ఉండేది. కాలక్రమేణా గోలీ సోడా స్థానంలోకి శీతల పానీయాలు వచ్చి చేరాయి. మళ్లీ ఇప్పుడు పాత రోజులు గుర్తు చేసేందుకు గోలీ సోడాలు మార్కెట్లోకి వచ్చేశాయి. అప్పట్లో వీటి టేస్ట్‌ చూసిన వారు.. ఆ టేస్ట్‌ తెలుసుకొని నేటి యువత వాహ్‌.. అంటున్నారు. గోలీ సోడా తాగితే చాలు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు హైదరాబాద్‌ యువత.    

నగరంలో గోలీ సోడాకు పెరుగుతున్న క్రేజ్‌
డిఫరెంట్‌ ఫ్లేవర్స్‌లో కలర్‌ఫుల్‌గా ..
సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న యూత్‌ 

ఒకప్పుడు తోపుడు బండ్లపై నిమ్మకాయ సోడా, సాదా సోడాలు అమ్ముతుండే వారు. ఇప్పుడు మాత్రం డిఫరెంట్‌ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చాయి. అలా హైదరాబాదీ బిర్యానీ తిన్నామంటే.. ఓ గోలీ సోడా పడాల్సిందే.. అన్నట్టు ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు సిటీ యూత్‌. డిఫరెంట్‌ ఫ్లేవర్స్‌తోనే కాకుండా క్రేజీ కలర్స్‌లో దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లలో గోలీసోడాల సీసాలను ఇప్పుడు అమ్ముతున్నారు. బ్లూబెర్రీ, వర్జిన్‌ మొజిటో, లెమనేడ్, నింబూమసాలా, యాపిల్‌ మొజిటో, ఆరెంజ్, రోజ్‌ఎసెన్స్‌ ఇలా వేర్వేరు ఫ్లేవర్స్‌లో కంపెనీలు తయారు చేస్తున్నాయి. లెమన్‌ ట్రీ, పర్పుల్‌ హేజ్, బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌ం అంటూ పాపులర్‌ 
ఇంగ్లిష్‌ పాటల పేర్లు పెట్టి మరీ యువతను ఆకర్షిస్తున్నారు. దుకాణాలతో పాటు కొన్ని హోటళ్లూ, క్లబ్బులూ కాలేజీలకు కూడా ఈ సోడాలను సరఫరా చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి మళ్లీ.. సోడావైపు మళ్లింది.

ఆ టేస్టే వేరు.. 
గోలీ సోడా సీసా స్టైల్, కలర్, గోలీ కొడుతుంటే వచ్చే శబ్దం.. అందులోని సోడా అన్నీ ప్రత్యేకమే.. చిన్నప్పుడు ఊర్లలో ఒకటి, రెండు రూపాయలకు దొరికే సోడా తాగేందుకు ఎంతో ఎదురు చూసేవాళ్లం. సోడా తాగిన తర్వాత వచ్చే అనుభూతి వేరేలా ఉండేది. ఇప్పుడు కూడా ఎక్కడైనా సోడా బాటిల్‌ కని్పస్తే వేరే కూల్‌డ్రింక్స్‌ ఉన్నా కూడా గోలీ సోడా తాగుతుంటే వచ్చే మజానే వేరు. – సాయికిరణ్‌ మెగావత్, హిమాయత్‌నగర్‌

ఆ శబ్దం వింటే.. అదో ఆనందం..
పిల్లలకు గోలీ సోడా సరదా ఓ పట్టాన తీరేది కాదు. రబ్బరు కార్కుతో సోడా కొట్టగానే గోలీ లోపలికి వెళ్లినప్పుడు వచ్చే ఆ శబ్దానికి కళ్లనిండా ఆశ్చర్యమే. ఆ శబ్దం వింటే మనసుకు అదో తృప్తి. గోలీసోడాలో ఉండేది కార్బొనేటెడ్‌ నీళ్లే. మొదటగా 1767లో జోసెఫ్‌ ప్రిస్ట్‌లే అనే శాస్త్రవేత్త, కార్బన్‌డయాక్సైడ్‌ను నీటిలోకి పంపి, స్నేహితులకిస్తే, ఆ రుచి నచ్చడంతో అందులో పండ్ల ఫ్లేవర్లూ, చక్కెరలూ కలిపి సాఫ్ట్‌డ్రింక్స్‌ తయారు చేయడం ప్రారంభించారు. అందుకే సోడా కూడా ఓ సాఫ్ట్‌ డ్రింకే.. మొదట్లో సోడా నీళ్లని సాదా బాటిల్స్‌లోనే నింపేవారు. అయితే మూత బిగించేటప్పుడూ తీసేటప్పుడూ గ్యాస్‌ పోయేది. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చూస్తున్న కాడ్‌నెక్‌ బాటిల్‌ను రూపొందించారు. 1872లో హిరమ్‌ కాడ్‌ అనే బ్రిటిష్‌ ఇంజినీర్‌ దీన్ని తయారు చేశాడు. ఈ బాటిల్‌ మందంగా ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement