రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్‌ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో.. | Ex-Google Techie Leaves Rs 4.2 Crore Job To Start Restaurant Goes Viral | Sakshi
Sakshi News home page

రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్‌ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో..

Jun 26 2026 10:58 AM | Updated on Jun 26 2026 12:00 PM

Ex-Google Techie Leaves Rs 4.2 Crore Job To Start Restaurant Goes Viral

అధిక వేతనం అందుకునే ఉద్యోగి లైఫ్‌ బిందాస్‌గా ఉంటుంది. కానీ కొందరు ఆ లగ్జీర లైఫ్‌ని వద్దనుకుని మరి తనకు తానే బాస్‌గా ఉండాలంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారతారు. కొందరు ఆ క్రమంలో సక్సెస్‌ని అందుకుంటే మరికొందరు చతికిలపడతారు. అయినా సరే తగ్గేదేలే అంటూ సక్సెస్‌ని ఒడిసిపట్టుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకుంటే..ఓ టెకీ ఏకంగా కోట్లు ఆర్జించే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి మరి బార్బెక్యూ రెస్టారెంట్‌ మొదలుపెట్టాడు. మరి అన్ని కోట్లలో సక్సెస్‌ అందుకున్నాడా అంటే..?

అతడే కాలిఫోర్నియాకు చెందిన అబ్దుల్‌ కపీ. ప్రముఖ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, క్రూయిజ్‌ వంటి సంస్థలలో సుమారు 14 ఏళ్ల పాటు పనిచేసిన టెకీ ఇక ఉద్యోగంలో కొనసాగకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి అతడు టెకీగా రూ. 4.25 కోట్ల వార్షిక వేతనం అందుకునేవాడు. 

అందరూ అంత మొత్తంతో ఎంతో కొంత డభ్బైనా.. వెనకేసే ప్రయత్నం చేస్తే..అదేమి వద్దంటూ సొంతంగా రెస్టారెంట్‌ వ్యాపారం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. అలా 50 శాతానికి పైగా వేతన కోతను అంగీకరించి, శాన్ ఫ్రాన్సిస్కోను విడిచిపెట్టి అబ్దుల్‌ కఫీ ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థలో చేరాడు. ఆ ఉద్యోగంతో పాటు, అబ్దుల్-కాఫీ తన స్నేహితుల కోసం విందులు ఏర్పాటు చేయడం, బార్బెక్యూ వంటకాలు చేయడం ప్రారంభించారు. 

ఆయన వంటశైలికి స్నేహితులు ఫిదా అవ్వుతూ.. చాలా రుచిగా ఉందని ప్రశంసించారు. దాంతోనే తనకు టెక్సాస్ బార్బెక్యూలో ఇంకా ఏమైనా కొత్తగా చేయడానికి అవకాశం ఉందా అని ఆలోచించడం ప్రారంభించాడు. అలా డిసెంబర్‌ 2024లో కఫీ ‘హలాల్ బార్బెక్యూ’ రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. జస్ట్‌ మూడు రోజుల పాటు సరిపోయేంత బార్బెక్యూను సిద్దం చేయగా, ఊహించని విధంగా మొత్తం ఒక్కరోజులోనే అమ్ముడుపోయింది. 

దాంతో రాత్రిళ్లు వంట చేయడం ప్రారంభించారు. అలా చాలా తక్కువటైంలోనే చాలా వేగవంతంగా ప్రజాదరణ పొందడం ప్రారంభమైంది. గతేడాది దాదాపు రూ. 21 కోట్లు ఆదాయం ఆర్జించగా, ఈ ఏడాది రూ. 37.8 కోట్లు ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. అయితే, రెస్టారెంట్ ప్రారంభించినప్పటి నుంచి తాను ఒక్క డాలర్ కూడా వేతనంగా తీసుకోలేదని, తన పొదుపు డబ్బుతోనే జీవనం సాగించినట్లు తెలిపారు. 

కానీ అధిక వ్యయం..
రెస్టారెంట్‌ అద్భుతమైన విజయం సాధించినప్పటికీ..భవిష్యత్తులో చాలా జాగురుకతతో వ్యవహరించాలని అంటున్నాడు. ఈ వ్యాపారం మంచి లాభాల బాట పట్టినప్పటికీ..సుమారు 1 మిలియన్ డాలర్ల మేర ఉన్న ప్రారంభ పెట్టుబడిని ఇంకా పూర్తిగా తిరిగి చెల్లించలేదని అన్నారు. అంతేగాదు ఈ రెస్టారెంట్‌ని నడపడానికి అయ్యే అధిక ఖర్చు గురించి కూడా ప్రస్తావించారు. 

నెలవారీ ఖర్చులు 215,000 (రూ. 2 కోట్లు)డాలర్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఆహారం కోసం 125,000 డాలర్లు(రూ. 1 కోటి), కార్మికుల కోసం 50,000 డాలర్లు(రూ. 47 లక్షలు), అద్దె కోసం 15,000 డాలర్లు (రూ. 14 లక్షలు)ఉన్నాయన్నారు. అలాగే మార్కెటింగ్ ఇతర కార్యకలాపాలపై వేల డాలర్లు అదనంగా ఖర్చు అవుతోందన్నారు.

(చదవండి: సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement