పోషకాల్లో వెరీగుడ్డు! | Eggs: Rich Source of Protein | Sakshi
Sakshi News home page

పోషకాల్లో వెరీగుడ్డు!

Oct 4 2026 12:31 AM | Updated on Oct 4 2026 12:31 AM

Eggs: Rich Source of Protein

ప్రపంచవ్యాప్తంగా చౌకగా దొరికే పోషకాహారం గుడ్డు. గుడ్డులో పుష్కలంగా ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కండరాల పెరుగుదలకు, కంటి ఆరోగ్యానికి, మెదడు చురుకుదనానికి, ఎముకల బలానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ‘నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ’ (నెక్‌) 1982లో ఏర్పడే నాటికి మన దేశంలో ఏటా 10 బిలియన్‌ గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతుండేవి. ‘నెక్‌’ ఏర్పాటు తర్వాత దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ శరవేగంగా పుంజుకుంది. ప్రస్తుతం మన దేశం గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండోస్థానానికి ఎగబాకింది. ప్రపంచ వ్యాప్తంగా గుడ్ల ఉత్పాదన సహా ముఖ్యమైన విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...

గుడ్ల తలసరి వినియోగంలో టాప్‌–10
గుడ్ల ఉత్పాదనలో కొన్ని దేశాలు ముందంజలో ఉంటే, ఇంకొన్ని దేశాలు గుడ్ల తలసరి వినియోగంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. గుడ్ల తలసరి వినియోగాన్ని గణాంకాల్లో తెలుసుకుందాం...

సాధారణంగా ఒక గుడ్డు దాదాపు 50–60 గ్రాముల వరకు ఉంటుంది. బరువు తక్కువగా ఉన్నా, ఇందులో పోషకాలు మాత్రం అత్యధికంగా ఉంటాయి. గుడ్డు ప్రొటీన్‌లో శరీరానికి అవసరమైన తొమ్మిది అమినో యాసిడ్లు సంపూర్ణంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో శరీరానికి మేలు చేసే కొవ్వులు (హెడీఎల్‌), ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, కీలకమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సగటు గుడ్డు దాదాపు 72 కిలోకేలరీల శక్తిని ఇస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement