Doctors Mistook Teens Ovarian Cancer For Pregnancy - Sakshi
Sakshi News home page

కూతురిపై ఉన్న నమ్మకం గెలిచినా!..బయటపడ్డ మరో నిజం ఆ త​ల్లిని..

Published Thu, Jun 29 2023 1:31 PM | Last Updated on Fri, Jul 14 2023 4:02 PM

Doctors Mistook Teens Ovarian Cancer For Pregnancy - Sakshi

పాపం నిండా 15 ఏళ్లు నిండని ఓ టీనేజర్‌.. శరీరంలో ఏదో మార్పు. అర్థం కాలేదు. విపరీతమైన వెన్ను నొప్పి. కూర్చొలేదు, నుంచోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక వైద్యులను సంప్రదించింది. పలు వైద్య పరీక్షల తర్వాత బయటపడ్డ నిజం విని నమ్మలేకపోయింది. తల్లిదండ్రులు ఏం అంటారో తెలియక తల్లడిల్లింది. వైద్యులు చెప్పింది నిజం కాదని ఆ అమ్మాయి నమ్మకం. కానీ చివరికి పరీక్షలు తర్వాత బయటపడ్డ మరో నిజం మరింత ఘోరంగా, దారుణంగా ఉంది.

అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న హాలీ అనే టీనేజ్‌ అమ్మాయి 2019 జనవరిలో వెన్ను నొప్పితో తల్లడిల్లింది. దీంతో ఆస్పత్రి వెళ్లింది. పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ప్రెగ్నెంట్‌ అని తేల్చారు. దీంతో ఆ అమ్మాయికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైయ్యింది. ఆమెకు గట్టి నమ్మకం తాను ప్రెగ్నెంట్‌ కాదని. ఎందుకంటే ఆమె అప్పుడు 15 ఏళ్ల మాత్రమే.

ఈ విషయం విని తన తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని చాలా భయపడింది. ఐతే ఆమె తల్లి దీన్ని నమ్మలేదు. మరోవైపు ఆమె బరువు తగ్గిపోవడం, తలనొప్పి, అలసట వంటి విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె తల్లిదండ్రలు జోక్యంతో ఆమెకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలో ఆమె కడుపులో బిడ్డ లేదని తేలింది. ఐతే రిపోర్ట్‌ల్లో గుండె పగిలే మరో నిజం బయటపడింది.

ఈ నిజం ఆమెను, తల్లిదండ్రులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్‌ ఉందని తేలింది. ఆ కణుతులు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి..స్టేజ్‌ 4దశలో ఉన్నట్లు వెల్లడైంది. చివరికి పలు చికిత్సలు అనంతరం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది హాలీ. 

(చదవండి: డయాబెటిస్‌ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్‌ అయితే..డేంజర్‌లో ఉన్నారని అర్థం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement