ఇంగ్లీష్‌ ఆల్ఫాబెట్‌లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..! | Do You Know Thest interesting Facts | Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్‌ ఆల్ఫాబెట్‌లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..!

Jun 6 2025 8:15 AM | Updated on Jun 6 2025 8:15 AM

Do You Know Thest interesting Facts

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. గానీ కొన్ని గమ్మత్తైన విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎలా తెలుసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ కొన్నింటి గురించి తెలుసుకుందామా..!

ఇరవైనాలుగు ఏళ్ల వయసులో రోమ్‌ సామ్రాజ్య పాలకుడైన కలిగ్యులా తన గుర్రానికి సెనెటర్‌ హోదా ఇచ్చాడు.

అబ్రహం లింకన్‌ టాప్‌ హ్యాట్‌ ఫేమస్‌. ఫ్యాషన్‌ యాక్సెసరీగా మాత్రమే కాదు... వేరే రకంగా కూడా టాప్‌ హ్యాట్‌ను వినియోగించేవారట లింకన్‌.. ముఖ్యమైన నోట్స్, పేపర్‌లను టాప్‌ హ్యాట్‌లో స్టోర్‌ చేసేవారట.

ఇంగ్లీష్‌ ఆల్ఫాబెట్‌లో చివరగా చేర్చిన అక్షరం... జె

బ్లాక్‌బర్డ్‌ వయోలిన్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏమిటంటే... ఈ వాయిద్య పరికరాన్ని కలప నుంచి కాకుండా రాయితో తయారుచేస్తారు.

‘ది మ్యాట్రిక్స్‌’ సినిమాలోని ‘గ్రీన్‌ కోడ్‌’కు మూలం... జపనీస్‌ సుషి కుక్‌ బుక్‌.

ప్రపంచంలోనే అతి పెద్ద టీ–షర్ట్‌ను ప్లాస్టిండియా ఫౌండేషన్‌ తయారుచేసింది. రీసైకిల్‌ చేసిన 2,100,000 ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో దీన్ని తయారుచేశారు. ఈ టీ–షర్ట్‌ పొడవు 96.86 మీటర్లు.

‘ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ లాంగ్‌’ పుస్తకం 1558లో విడుదలైంది. ఇప్పటికీ ప్రింట్‌లో ఉంది. ఈ పుస్తకం రాసిన లూయిజీ కార్నరో వంద సంవత్సరాలు బతికాడు. 

Advertisement
 
Advertisement
Advertisement