
వివిధ రకాల మోడళ్లలో ఉండే కిటికీలను, వాటి తెరలను చూస్తుంటాం. వాటి డిజైన్‌కి, అలంకరణకు, కర్టెన్ల ప్రింట్లకు ముచ్చట పడిపోతుంటాం. కిటికీలు ఇంటి లోపలికి గాలి వెలుతురు వచ్చేందుకు ఏర్పాటు చేస్తుంటారు. వాటికి అలంకరించే తెరలు దుమ్ము, గాలుల నుంచి రక్షణగా కూడా వాడుతుంటారు. కాని, ఇంటి అలంకరణ కోసం ‘షో కిటికీల’ను వాడితే.. ఎలా ఉంటుందో చూడాలంటే... కర్టెన్లు ఉన్న ఈ విండో వాల్ ఫ్రేమ్స్‌ను చూడాల్సిందే!
అపార్ట్‌మెంట్ల కల్చర్ పెరిగిపోయాక పెద్ద పెద్ద లోగిళ్లు ఉన్న ఇళ్లు తగ్గిపోతున్నాయి. కిటికీలు పెట్టాలంటే అన్ని చోటలా కుదరకపోవచ్చు. లేదంటే వాల్ హ్యాంగర్స్‌గా ఏదైనా బాగుంటుంది అనే ఆలోచనా కావచ్చు. వీటన్నింటికీ ఒకే సమాధానంగా ‘షో విండోస్’ సరైన ఎంపిక అవుతున్నాయి.
ఫ్లవర్ బాస్కెట్‌గా!
వుడెన్ లేదా పీవీసీ మెటీరియల్‌తో చేసిన క్రియేటివ్ విండో షెల్ఫ్ డెకరేషన్ ఫ్లవర్ బాస్కెట్‌గా డిజైన్స్ బట్టి వెయ్యి రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి. దీనిలోనే వింటేజ్ విండోస్ ఫ్రేమ్ వాల్ డెకర్ ప్లాంట్ లేదా హ్యాంగింగ్ ప్లాంట్ పాట్స్ హోల్డర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవి ఇంటి లోపలి గదుల్లో గోడలకు అలంకరించవచ్చు. బుక్ షెల్ఫ్ లేదా పెన్నులు, పెన్సిల్స్ వేసుకునేలా కూడా ఉపయోగించవచ్చు.
కార్వింగ్.. తెరలు
చుట్టూ అందమైన వుడెన్ కార్వింగ్, మధ్యలో మిర్రర్ వచ్చేలా కూడా ఈ షోకేస్ విండోస్ హ్యాంగర్స్ లభిస్తున్నాయి. రకరకాల డిజైన్లలో ఉండే చిన్న చిన్న తెరలు ఉండే ఈ డిజైన్ హోల్డర్స్ బెడ్‌రూమ్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్‌లకు అందాన్ని తీసుకువస్తాయి.
ఆరుబయటఇండోర్ విండో షెల్ఫ్ హోల్డర్స్ ఒకలాంటి అందాన్ని తీసుకువస్తే, ఔట్‌డోర్‌కి మరొక అలంకరణగా మారిపోతాయి. ఔట్‌డోర్ గోడకు విండో షెల్ఫ్ హోల్డర్‌ని తగిలించి, దాని ముందు టేబుల్, ఇరువైపులా రెండు చెయిర్లు వేస్తే గార్డెన్ లేదా కేఫ్‌లుక్ వచ్చేస్తుంది.
ఎన్నార్
(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!)