ఓ పక్క అద్భుతమైన మోడల్‌గా..మరోవైపు క్యాట్‌లోనూ సత్తా చాటింది

This Cracked CAT CAT With 98 Percentile Now Works With MNC  - Sakshi

అందం, అద్బుతమైన తెలివితేటలు ఆమె సొంతం. ఒక పక్క తనకు ఇష్టమైన అభిరుచిలో రాణిస్తూనే మరోవైపు చదువులోనూ  సత్తా చాటి ..తనకు తానే సాటి అని నిరూపించుకుంచి. 'బ్యూటీ విత్‌ బ్రెయిన్‌'కి ఉదాహరణగా నిలిచింది. ఓ మనిషి రెండింటింలోనూ రాణించగలడని నిరూపించించి మోడల్‌ ఆకాంక్ష చౌదరి.

ఆకాంక్ష చౌదరి పేరుకు తగ్గట్టుగానే తన ఆకాంక్షలని నెరవేర్చుకుని అందర్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆమె 2016లో మిస్‌ ఇండియా ఎలైట్‌ విజేత. ఆమెకు మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆమెకు అదోక ప్యాషన్‌ కూడా.  ఒకపక్క మోడలింగ్‌పై దృష్టి పెడుతూనే తన కెరియర్‌ని మంచి గాడిలో పెట్టుకుంది. ఆమె క్యాట్‌లో 98.12 పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించి ఆశ్చర్యపరిచింది. ఆమె మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కి దరఖాస్తు చేస్తున్నప్పుడే మిస్‌ ఇండియా ఎలైట్‌ పోటీకి ఎంపికైంది.

అతన అభిరుచిని అనుసరించి అందాల పోటీలో విజేతగా నిలిచింది. అదే సమయంలో క్యాట్‌ ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అయ్యింది. ఆమె ఐఐఎం అహ్మాదాబాద్‌లో 2017-2019 బ్యాచ్‌ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ . ప్రస్తుతం ఆమె మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆకాంక్ష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను మోడల్‌గా ఈ టైటిల్‌ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానని అనుకోలేదు. మోడలింగ్‌ మారబోతున్నాను. మోడలింగ్‌ నన్ను ఫిట్‌గా ఉండేలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేసింది.

చదువు తోపాటు మోడలింగ్‌లోనూ రాణించేందుకు తాను టైం షెడ్యూలను చాలచక్యంగా నిర్వహించాల్సి వచ్చేదని చెబుతోంది ఆకాంక్ష. నిజానికి ఆకాంక్ష మోడలింగ్‌, కాంపిటీటవ్‌ ఎగ్జామ్‌ రెండింటికి ఏకాకాలంలో సన్నద్ధమైంది. చక్కగా బ్యాలెన్స్‌ చేసి అనుకున్నది సాధించింది. ఒక వ్యక్తి తన అభిరుచిని అనుసరిస్తూనే బిజినెస్‌ రంగంలో కూడా రాణించగలడిని నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది.  

(చదవండి: రష్యాలో వాగ్నర్‌ గ్రూప్‌ మాదిరిగా..చరిత్రలో వెన్నుపోటు పొడిచిన నాయకులు వీరే!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top