కలెక్టర్ మామిడి కాయలు చెట్టు ఎప్పుడైనా చూసారా | Collector Mango: A Unique Late-Ripening Variety Famous in the Godavari Districts | Sakshi
Sakshi News home page

కలెక్టర్ మామిడి కాయలు చెట్టు ఎప్పుడైనా చూసారా

Jul 3 2026 11:29 AM | Updated on Jul 3 2026 1:47 PM

Collector Mango: A Unique Late-Ripening Variety Famous in the Godavari Districts

కలెక్టర్‌... గోదావరి జిల్లాల్లో పిలిచే ఓ రకం మామిడి కాయలు. సాధారణంగా అన్ని మామిడి రకాలు వర్షాలు పడే సమయం అనగా జూన్‌ నెలాఖరుకు పక్వానికి వచ్చి మామిడి పండ్ల సీజన్‌ పూర్తి అవుతుంది. కలెక్టర్‌ రకం మామిడి మాత్రం ఇతర రకాలకు భిన్నంగా చాలా ఆలస్యంగా జూలై మధ్య నాటికి పక్వానికి చేరుకుంటాయి. ఇది ఇతర రకాల కంటే ఆలస్యంగా పూతకు వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కలెక్టర్‌ మామిడికి తోటపురి, బెంగళూరా, కల్లమై, కిలిమూకు, గిల్లి, సందేర్ష, ముక్కు, ఒట్టు అనే పేర్లతో కూడా ఆయా ప్రాంతాలను బట్టి పిలుస్తారు. 

అయితే గోదావరి జిల్లాల్లో కాస్త పొడవుగా నిటారుగా, ఠీవీగా ఉండడం వల్లనేమో ఇక్కడి ప్రజలకు ఈ మామిడిని కలెక్టర్‌ అని అంటారు. సాధారణంగా ఈ మామిడి కాస్త పులుపు జోడించుకుని తియ్యగా ఉంటుంది. గతంలో ఈ మామిడిని అధికంగా తాండ్ర తయారీలో ఉపయోగించే వారు. సాగు అధికంగా ఉండడంతో జ్యూస్, డ్రింక్‌ల తయారీకి వెళ్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమ, కాకినాడ జిల్లాల్లో బంగినపల్లితో పాటు ఇతర రకాల మామిడి పండ్ల తరువాత ఈ కలెక్టర్‌ మామిడి సాగు అధికంగా ఉంటుంది.          
–మలికిపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement