‘పెద్దొరిసి’ కేరాఫ్‌ వెంకటాపురం, రేటెంతో తెలిస్తే షాకవుతారు | Chicken Breed peddorisi for cock fighting | Sakshi
Sakshi News home page

‘పెద్దొరిసి’ కేరాఫ్‌ వెంకటాపురం, రేటెంతో తెలిస్తే షాకవుతారు

Jun 30 2025 12:31 PM | Updated on Jun 30 2025 12:40 PM

Chicken Breed peddorisi for cock fighting

కొత్తూరు: పెద్దొరిసి.. ఇదో రకం జాతికోడి. పందేలకు వినియోగించే అరుదైన రకాల్లో ఇదీ ఒకటి. కొత్తూరు మండలం వెంకటాపురం ఇప్పుడు ఈ తరహా కోళ్లకు కేరాఫ్‌గా మారింది. గ్రామానికి చెందిన గండికోట త్రినాథరావు సుమారు 100 జాతికోళ్లను పెంచుతున్నారు. వీటిని పెంచడం ఆషామాషీ కాదు. పశువైద్యుల పర్యవేక్షణలో ఈ కోళ్లను త్రినాథరావు పెంచుతున్నారు.

పగలంతా తోటల్లో ఉంచుతూ సాయంత్రానికి షెడ్‌ వద్ద కు చేరుస్తారు. నాటుకోళ్లలో అరుదైన ఈ రకానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రుచి అమోఘం కావడంతో గోదావరి జిల్లాలకు చెందిన వారు అడ్రస్‌ కనుక్కుని మరీ ఇక్కడకు వచ్చి కోళ్లను కొంటుంటారు. 

చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే

కోడి బరువు, సైజ్‌ను బట్టి రెండు వేలు నుంచి రూ. 20 వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భాల్లో గోదావరి జిల్లాలతో పాటు పొలకొండ మండలంతో పాటు ఒడిశా నుంచి వస్తుంటారు. గుడ్లను ఇక్కడే పొదిగిస్తుంటామని, ఇతర ప్రాంతాలను నుంచి పిల్లలకు తీసుకురావడం లేదని పెంపకందారు చెబుతున్నారు. ఈ కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. 

ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్‌ : ఆమె స్పెషల్‌ వెడ్డింగ్‌ గౌను విశేషాలు
 

Advertisement
 
Advertisement
Advertisement