చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌ : హై ప్రొటీన్‌ కోసం ఏది బెటర్‌ | Highest Protein Part of Chicken Leg Piece or Breast Piece check here | Sakshi
Sakshi News home page

చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌ : హై ప్రొటీన్‌ కోసం ఏది బెటర్‌

May 22 2026 7:15 PM | Updated on May 22 2026 7:40 PM

Highest Protein Part of Chicken Leg Piece or Breast Piece check here

ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా వినియోగించే మాంసాలలో కోడి మాంసం లేదా చికెన్‌  ఒకటి. చికెన్‌లో  ప్రోటీన్‌  పుష్కలంగా లభిస్తుంది.   అందుకే ఫిట్‌నెస్ ప్రియులకు ఫస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలా మంది మాంసాహారులు  చికెన్‌ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. కానీ కోడిలో ఏ భాగం అత్యధిక ప్రోటీన్‌ను అందిస్తుందనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు.  ఆ వివరాలేంటో తెలుసుకుందామా?


చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకే రకంగా ప్రోటీన్ ఉండదు. కొన్ని భాగాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటే మరికొన్ని భాగాల్లో   తక్కువగా  కొవ్వు ఎక్కువగా ఉంటుంది.  చికెన్‌ బ్రెస్ట్‌, చికెన్‌  లెక్స్‌ ఇలా  ఏ భాగంలో ఎంత  ప్రొటీన్‌,  ఎంత   కొవ్వు ఉంటుందో  తెలుసుకోవాలి.   

చికెన్ బ్రెస్ట్ : అత్యధిక ప్రోటీన్ ఉండే భాగం చికెన్ బ్రెస్ట్. 100 గ్రాముల బ్రెస్ట్ సుమారు 30–32 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని “లీన్ మీట్”గా కూడా పరిగణిస్తారు. జిమ్‌కు వెళ్లేవారికి,   బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

చికెన్‌ లెగ్‌ :  సుమారు 25–27 గ్రాముల ప్రోటీన్‌కు మంచి మూలం. అయితే, ఇందులో కొవ్వు కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్ల ఇది మరింత రుచికరంగా ఉంటుంది. అందుకే చాలా మంది తొడ భాగాన్ని ఇష్టపడతారు. అయితే, డైట్‌లో ఉన్నవారు దీని వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి.

చికెన్ వింగ్స్‌: ఇందులో మూడు భాగాలు ఉంటాయి. డ్రమెట్, వింగెట్ , వింగ్ టిప్. వీటిని తరచుగా స్నాక్స్‌గా లేదా బార్ ఫుడ్‌గా తింటారు. ఒక చికెన్ వింగ్‌లో (85 గ్రాములు) 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ప్రతి 100 గ్రాములకు 24 గ్రాముల ప్రోటీన్‌కు సమానం.

డ్రమ్‌ స్టిక్స్‌ : దీన్నిఒక మధ్యేమార్గపు ఎంపికగా భావించవచ్చు. ఇది 23–25 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, రుచి మధ్య మంచి సమతుల్యత ఉండటం వల్ల దీనిని తరచుగా కుటుంబ భోజనాలలో ఉపయోగిస్తారు. ఇది పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు.  స్కిన్‌ లెస్‌ డ్రమ్‌స్టిక్‌లో (95 గ్రాములు) 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది 100 గ్రాములకు 24 గ్రాముల ప్రోటీన్‌కు సమానం.మరోవైపు, చికెన్ వింగ్స్‌లో ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. అవి కేవలం 20–22 గ్రాముల ప్రోటీన్‌ను మాత్రమే అందిస్తాయి. వాటిని సాధారణంగా వేయిస్తారు కాబట్టి, వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కండరాలను పెంచుకోవాలనుకునే లేదా బరువు పెరగాలనుకునే వారికి ఇవి మరింత మంచివి. తక్కువ కార్బోహైడ్రేట్లు లేదా కీటో డైట్ పాటించేవారు కూడా ఎక్కువ కొవ్వు తినవలసి ఉంటుంది కాబట్టి వారికి మేలు. 

ఆరోగ్యకరమైన ఆహారం కోసం వాటిని తినకుండా ఉండటం లేదా మితంగా తీసుకోవడం ఉత్తమం. అత్యధిక ప్రోటీన్‌కోసం చికెన్‌ ఎంత ముఖ్యమో, దాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో వండటం కూడా అంతే ముఖ్యం. రుచితోపాటు, గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వేయించడానికి బదులుగా దానిని గ్రిల్  ,బేక్  చేసుకోవడం మంచిది.

అలాగే స్కిన్‌ లెస్‌ చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది.  మొత్తంగా ఎలా, ఏ భాగాన్ని తీసుకోవాలి అనేది పూర్తిగా మన ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే బ్రెస్ట్ ముక్కలు , టేస్ట్ కోసం చూస్తే రెక్కలు, డ్రమ్‌స్టిక్‌, లెగ్ ముక్కలు బెస్ట్‌. ఏదైనా మితంగా భోంచేయడం అన్నింటికన్నా ఉత్తమం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement