బ్రహ్మపుత్రను ‘రెడ్‌ రివర్‌’ అని ఎందుకు అంటారో తెలుసా? | Brahmaputra Red River India Amazing Facts | Sakshi
Sakshi News home page

బ్రహ్మపుత్రను ‘రెడ్‌ రివర్‌’ అని ఎందుకు అంటారో తెలుసా?

Aug 24 2026 8:38 AM | Updated on Aug 24 2026 9:08 AM

Brahmaputra Red River India Amazing Facts

ట్రావెల్‌

బ్రహ్మపుత్ర

భారత దేశంలో ఎన్నో రివర్స్‌ ఉన్నాయి. అందులో కొన్ని నదులు ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, ప్రకృతితో స్ట్రాంగ్‌ కనెక్షన్‌ కలిగి ఉంటాయి. అలాంటి గొప్ప నదుల్లో బ్రహ్మపుత్ర కూడా ఒకటి. బ్రహ్మపుత్ర నదిని కొన్ని సందర్భాల్లో రెడ్‌ రివర్‌ అని కూడా అంటారు.

బ్రహ్మపుత్ర నది జర్నీ టిబెట్‌లో ప్రారంభం అవుతుంది. టిబెట్‌లో దీనిని యార్లాంగ్‌ సాంగ్‌పో అని పిలుస్తారు. హిమాలయాలను దాటుకుంటూ భారత దేశంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ఎంటర్‌ అయ్యాక, దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అక్కడి నుంచి అస్సాం మీదుగా ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.

అస్సాంకి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చిన నేచురల్‌ ఫోర్స్‌గా బ్రహ్మపుత్ర నదిని కీర్తిస్తారు. నది చుట్టూ కనిపించే పచ్చని అడవులు, ద్వీపాలు, వెట్‌ల్యాండ్స్, హిమాలయన్‌ పాద ప్రాంతాలు కలిసి ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్‌ చేస్తాయి.

రెడ్‌ రివర్‌ అని ఎందుకు అంటారు?
ఇక రెడ్‌ రివర్‌ అనే పేరు విషయానికి వస్తే, నది నీటిలో కనిపించే ఎరుపు రంగే దీనికి కారణం. హిమాలయాల నుంచి భారీ స్థాయిలో వచ్చే సెడిమెంట్స్, మట్టి, ఖనిజాలు నదిలో కలుస్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నదీ నీరు ఎర్రగా లేదా మట్టిగా కనిపిస్తుంది.

బ్రహ్మపుత్ర అస్సాంకి కేవలం ఒక నది మాత్రమే కాదు. స్థానిక ప్రజల జీవితం కూడా. వ్యవసాయం, చేపలు పట్టడంలో ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ఇక్కడి కల్చర్‌తో కూడా ఈ నదికి చాలా స్ట్రాంగ్‌ కనెక్షన్‌ ఉంది. నదీ లోయలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల జీవితం కూడా ఈ నదితో పాటు కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది.

బ్రహ్మపుత్ర నదీ జర్నీలో మజూలీ అనే ప్రముఖ నది ద్వీపం కూడా ఒక స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం అస్సాం కల్చర్, ట్రెడిషన్స్‌, నేచురల్‌ బ్యూటీకి ప్రతీకగా నిలుస్తుంది.

హిమాలయాల నుంచి ప్రారంభమై, అస్సాం మైదానాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌ వరకు ప్రయాణించే బ్రహ్మపుత్ర నది జర్నీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే రెడ్‌ రివర్‌ అనే పేరుతో భారతీయ భౌగోళిక అద్భుతాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.

ఇవి చదవండి: ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement