ఒకరికి ఒకరై...  బహుదూరపు  బాటసారులై... | Bihar Man's 12000 KM Cycle Trip With Pet Dog | Sakshi
Sakshi News home page

ఒకరికి ఒకరై...  బహుదూరపు  బాటసారులై...

Jul 8 2025 4:12 AM | Updated on Jul 8 2025 4:12 AM

Bihar Man's 12000 KM Cycle Trip With Pet Dog

బంధం

సైకిల్‌ తొక్కుతూ ఎంత దూరమైనా వెళుతుంటాడు సోనూ రాజ్‌. అది అతడి హాబీ. ఒకరోజు దిల్లీ హైవేకు సమీపంలో గాయపడిన కుక్కకు సపర్యలు చేశాడు. కృతజ్ఞత నిండిన కళ్లతో ఆ శునకం నీడలా సోను రాజ్‌ వెనకాలే వెళ్లేది. ‘సరే, ఇక నుంచి నువ్వు నా ఫ్రెండ్‌. ఇప్పటి నుంచి నీ పేరు చార్లీ’ అని తాను ఎక్కడికి వెళ్లినా చార్లీని తీసుకువెళ్లేవాడు సోనూరాజ్‌.

దేశమంతా తిరగాలనేది సోను కల. ‘ప్రయాణానికి చాలా డబ్బులు కావాలి అంటారు. అయితే సంకల్పం గట్టిగా ఉంటే ఎక్కడో ఎవరో మన ప్రయాణానికి సహకరిస్తూనే ఉంటారు’ అనే చాప్లీ తన సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌నే నమ్ముకున్నాడు.

చార్లీతో కలిసి పదిహేను రాష్ట్రాలు చుట్టివచ్చాడు. బిహార్‌కు చెంది పేదింటి యువకుడు సోనూ రాజ్‌ కశ్మీర్‌ నుంచి అయోధ్య వరకు ఎన్నో విశేషాలను నాన్‌స్టాప్‌గా చెబుతూనే ఉంటాడు. లద్దాఖ్‌లో ఉన్నప్పుడు పర్యావరణవేత్త సోనమ్‌ వాంగుచూక్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. అమీర్‌ఖాన్‌ ‘త్రీ ఇడియట్స్‌’కు సోనూ స్ఫూర్తి. సోనూరాజ్‌ సైకిల్‌యాత్ర గురించి విని శభాష్‌ అనడంతో పాటు కొత్త సైకిల్‌ను బహుమానంగా ఇచ్చాడు సోనమ్‌ వాంగుచూక్‌.

తన ప్రయాణాలలో కొన్ని సార్లు సోనూ రాజ్‌కు ప్రమాదాలు జరిగాయి. తృటిలో తప్పిన ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్రలోని ఒక ప్రాంతంలో జీప్‌ ఢీ కొట్టడంతో గాలిలోకి ఇంతెత్తున ఎగిరి అంతదూరంలో స్పృహ తప్పి పడిపోయాడు సోను. తన ఫ్రెండ్‌ను కాపాడుకోవాలని దగ్గరలో ఉన్న దాబాకు పరుగెత్తుకు వెళ్లింది చార్లీ. అక్కడ ఉన్న వాళ్లను తీసుకురావడంతో, వారు సోనును హాస్పిటల్‌లో చేర్పించారు. అలా సోనూ రాజ్‌ను కాపాడి రుణం తీర్చుకుంది చార్లీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement