డ్రై ‍ఫ్రూట్స్‌, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..! | Benefits Of Consuming Soaked Nuts In The Morning | Sakshi
Sakshi News home page

డ్రై ‍ఫ్రూట్స్‌, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..!

Published Mon, Jun 24 2024 4:58 PM | Last Updated on Mon, Jun 24 2024 6:07 PM

Benefits Of Consuming Soaked Nuts In The Morning

ఆయుర్వేదం ప్రకారం, డ్రై ఫ్రూట్స్, ఇతర కొన్ని రకాల గింజలను తినే ముందు రాత్రిపూట నీటిలో నానబెట్టడం మంచిది తద్వారా వాటిల్లోని జీవపదార్థం ద్విగుణీ కృతమవుతుందని తినడానికి సులభంగా ఉంటుందని చెబుతారు. నానబెట్టడం వల్ల నట్స్ , డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాల లభ్యతను పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.

నానబెట్టడం వలన కలిగే ప్రయోజనాలు 
నానబెట్టిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలతో కూడిన అద్భుతమైన మూలాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధులను నివారించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

నానబెట్టినపుడు గింజల రుచి, ఆకృతి రెండూ పెరుగుతాయి. అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ తొలగి పోతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే  టానిన్  లేదా (ఆమా) గణనీయంగా తగ్గిస్తుంది. గట్ దీంతో గట్‌ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మానవ శరీరాన్ని నియంత్రించే మూడు వాత, పిత్త , కఫ దోషాలు రాకుండా ఉంటాయి.  వీటి వల్ల బాడీలో అసమతుల్యత, ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మచ్చుకు కొన్ని

మెంతులు: రెండు చెంచాల మెంతుల్ని త్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉనాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.

అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నాన బె ట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి  లభిస్తుంది.

అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఏ, బీ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.ఇది మహిళల ఆరోగ్యానికి చాలామంచిది.  

గుమ్మడి విత్తనాలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మలబద్దకం సమస్యకు కూడా మంచి పరిష్కారం. చెడు కొలెస్ట్రాల్ కరుగుతంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాగే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వా ప్రశాంతమైన నిద్ర కావాలంటే వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.

నోట్‌: రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ , గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అనారోగ్య సమస్యలను  ఎందుర్కొంటున్నా, ఏదైనా ఇతర సమస్యలున్నా, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement