శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..? | Beauty Tips: Winter Skin Care Tips For Preventing Dry | Sakshi
Sakshi News home page

శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?

Nov 28 2024 10:18 AM | Updated on Nov 28 2024 10:31 AM

Beauty Tips: Winter Skin Care Tips For Preventing Dry

శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్‌ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.

  • టీ స్పూన్‌ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్‌ మృదువుగా మారుస్తుంది.

  • పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్‌ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత  మృదువుగా మారుస్తాయి.

  • టేబుల్‌ స్పూన్‌ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్‌ చేసి, ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. 

(చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్‌, అరటిపండ్లతో ఇలా చేయండి..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement