బ్యాక్ ప్యాక్‌ కూలర్‌ బ్యాగు | Backpack Coolers Easy to Carry and cool | Sakshi
Sakshi News home page

బ్యాక్ ప్యాక్‌ కూలర్‌ బ్యాగు

Nov 8 2024 2:40 PM | Updated on Nov 8 2024 2:40 PM

Backpack Coolers Easy to Carry and cool

కూల్‌డ్రింక్స్‌ వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబ యట పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్‌ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్‌ లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్‌ రిఫ్రిజిరేటర్లను, ఐస్‌మేక ర్లను మోసుకుపోనవసరం ఉండదు. 

ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్‌లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్‌లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసిన ట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేష న్‌తో రూపొందించిన ఈ బ్యాగ్‌ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్‌ స్టార్టప్‌ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్‌ కూలర్‌ బ్యాగును ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది.

 ఇదీ చదవండి: వోయేజర్‌–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం


 

Advertisement
 
Advertisement
Advertisement