సాధారణంగా మందులను వేసుకునేముందు గడువు తేదీ ఉండటం ఎంత ముఖ్యమో.. వాటిని భద్రపరచడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అవి ఉపయోగించే గడువు సమయం దాటక పోయినా వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేడి, తేమ, నేరుగా పడే ఎండ మందుల నాణ్యతను గడువు తేదీకి ముందే దెబ్బతీయవచ్చు.
- చాలామంది మెడిసిన్‌ని కిచెన్‌లో ఉంచుతుంటారు. అక్కడ ఉండే అధిక వేడి మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు.
- తేమ ఉండే ప్రాంతాల్లోనూ మందులను ఉంచకూడదు. తేమ కారణంగా మాత్రలు, గుళికలు దెబ్బతినే అవకాశం ఉంది.
- కారులోనూ మందులను ఉంచకూడదు. ఎండ ఎక్కువగా ఉన్నపుడు కారు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. ∙కిటికీ అంచుపై, నేరుగా పడే సూర్యకాంతి కొన్ని మందులను ప్రభావితం చేయవచ్చు
- రిఫ్రిజిరేటర్ పైభాగంలో మెడిసిన్ ఉంచడం వల్ల దాని నుంచి వెలువడే వేడి మందులపై ప్రభావం చూపవచ్చు.
- మందులను ఎప్పుడైనా చల్లగా, పొడిగా, నేరుగా ఎండపడని ప్రదేశంలో భద్రపరచాలి. అయితే కొన్ని మందులకు ప్రత్యేకంగా భద్రపరచాల్సి ఉంటుంది.
కాబట్టి ఆయా మందుల షీట్‌పై ఉన్న సూచనలను తప్పక పాటించాలి. మందుల గడువు తేదీని మాత్రమే చూడకండి.. అది ఇంతకాలం ఎక్కడ ఉందో కూడా గమనించండి!


