ఇంటిప్స్‌: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి! | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి!

Published Fri, Mar 1 2024 8:14 AM

Are You Having Trouble With These Do This Permanently - Sakshi

'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్‌ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్‌ వాడారో.. కాస్త వీటి టెన్షన్‌ నుంచి రిలీఫ్‌ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..'

ఈ విధానాలు..

  • కూరలో నీరు ఎక్కువైతే కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కూడా కూర చిక్కబడదు. అలాంటప్పుడు వేయించిన వేరుశనగపప్పులు పొడి కలిపితే చిక్కదనంతోపాటు రుచి కూడా ఇనుమడిస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఈ చిట్కా మంచి ఫలితాన్నిస్తుంది.
  • బంగాళాదుంపలు వాడిపోయినట్లయితే.. ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని పోసి ఓ అరగంట ఉంచితే తాజాగా మారుతాయి.
  • అల్లంవెల్లుల్లి పేస్ట్‌ గ్రైండ్‌ చేసేటప్పుడు అందులో చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్‌ నూనె వేయాలి. ఇలా గ్రైండ్‌ చేసిన పేస్ట్‌ను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది.
  • వెల్లుల్లిపొట్టు త్వరగా వదలాలంటే.. రేకలను ఒక పాత్రలో వేసి కొద్దిగా నూనె వేసి అన్నింటికీ పట్టేటట్లు వేళ్లతో రుద్ది ఇరవై నిమిషాల సేపు ఎండలో పెట్టాలి.
  • పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టేముందు తొడిమలు ఒలిచి న్యూస్‌ పేపర్‌లో చుట్టి పాలిథిన్‌ కవర్‌లో పెట్టాలి.
  • మార్కెట్‌లో కొన్న పనీర్‌ని వండే ముందు పది నిమిషాల సేపు గోరువెచ్చటి నీటిలో నానబెడితే, పనీర్‌ ముక్కలు మృదువుగా మారుతాయి.

    ఇవి చదవండి: చెట్టినాడు ఘుమఘుమలు! 

Advertisement

తప్పక చదవండి

Advertisement