AI-Generated Video Imagines Sholay Made by Hollywood - Sakshi
Sakshi News home page

బసంతీ... వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌?

Jul 23 2023 3:35 AM | Updated on Jul 23 2023 10:47 AM

AI generated video imagines Sholay made by Hollywood - Sakshi

‘హాలీవుడ్‌ షోలే’ పేరుతో విడుదలైన ఏఐ జెనరేటెడ్‌ వీడియో ఇమేజ్‌లు అంతర్జాలంలో వైరల్‌ అయ్యాయి. ‘షోలే’లోని ప్రధాన క్యారెక్టర్‌లకు హాలీవుడ్‌ ప్రముఖ నటుల ముఖాలను సూపర్‌ ఇంపోజ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌లలో రాబర్ట్‌ డి నిరో ‘జై’, అల్‌ పసినో ‘వీరు’, జూలియా రాబర్ట్స్‌ ‘బసంతి’, కెవిన్‌ స్పేసీ ‘ఠాకూర్‌’, జాక్‌ నికల్సన్‌ ‘గబ్బర్‌సింగ్‌’లుగా కనిపిస్తారు.

‘అంతా బాగానే ఉందిగానీ ఠాకూర్‌ పాత్రకు కెవిన్‌ను ఎంపిక చేసుకోవడం బాగోలేదు. ఎందుకుంటే ఠాకూర్‌ నిజాయితీపరుడు. ముక్కుసూటి మనిషి. కెవిన్‌ సైకో పాత్రలకు పెట్టింది పేరు’ ‘షోలే అనేది ఎన్నో హాలీవుడ్‌ సినిమాల కాపీ. మెయిన్‌ ప్లాట్‌ 7 సమురాయ్, కొన్ని పవర్‌ఫుల్‌ సీన్‌లను వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ వెస్ట్‌ సినిమాలలో నుంచి తీసుకున్నారు’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement