శ్రీవారి క్షేత్రం.. భక్తజన సందోహం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రం.. భక్తజన సందోహం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

● కార్తీక శనివారం కావడంతో దర్శనానికి పోటెత్తిన భక్తులు

● దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న క్షేత్రం

ద్వారకాతిరుమల: కార్తీకమాసం.. శనివారం కావడంతో చినవెంకన్న దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక పెరగడంతో దర్శన క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్‌ కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రసాదం కౌంటర్లు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట వద్ద రద్దీ నెలకొంది. మరోవైపు కార్తీకమాస దీపారాధనలో భాగంగా ఆలయ ఆవరణలోని దీపారాధన మండపం భక్తులతో కళకళలాడింది. భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీపజ్యోతుల వెలుగులు, హరినామ సంకీర్తనలు, గోవింద నామస్మరణలతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాక కొనసాగడంతో క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

భక్తులతో నిండిపోయిన దర్శనం క్యూలైన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement