పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయలసీమ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. పట్టణ రైల్వే స్టేషన్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఈ నెల 22 వరకు కొనసాగుతుందని, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది సభ్యులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన బృందం శనివారం ఉదయం నంద్యాల చేరుకుని, అక్కడి నుంచి అహోబిలం, జ్వాలా, మాలోల ఆలయాల దర్శనం అనంతరం ట్రెక్కింగ్ చేస్తుంది. ఆదివారం బెలూం గుహలు, యాగంటి, మహానంది క్షేత్రాలను సందర్శించి తిరుగు ప్రయాణమవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో కొట్టి భాస్కరరావు, విఎస్‌ఎస్ ప్రసాద్, కేఎస్‌పీఎన్ వర్మ, నూలి భాస్కరరావు, సొలస త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.


