దెందులూరు: టయోటా కిర్లోస్కర్ మోటార్ అధీకృత డీలర్ భాగస్వామి పృథ్వీ టయోటా నూతన షోరూమ్, సర్వీస్ కేంద్రాన్ని ఏలూరులో ప్రారంభించింది. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పృథ్వీ టయోటా ఎండీ ఎం.పృథ్వి స్వాగతోపన్యాసం చేస్తూ నాణ్యత, భద్రత, విశ్వసనీయతతో కూడిన వాహనాలు, సేవలు అందిస్తామని తెలిపారు. చైర్మన్ ఎం.రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. వాహన ప్రదర్శన, అత్యాధునిక సర్వీస్ వర్క్‌షాప్, ఒరిజినల్ విడిభాగాలు, కస్టమర్ కేర్ సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎండీ ఎం.పృథ్వి, సీఈఓ కె.జగదీష్, సేల్స్ జీఎం ఎస్.హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.


