న్యూస్‌రీల్
ఖర్చు టీడీపీది.. పదవి బీజేపీది
శురకవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పరిషత్ ఎన్నికల్లో కీలక అంకమైన మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ), వైస్ ఎంపీపీ ఎన్నికలు గురువారం జిల్లాలోని 27 మండలాల్లో ముగిశాయి. అధికార పార్టీ బెదిరింపులు, ఒత్తిళ్లను తట్టుకుని వైఎస్సార్‌సీపీ మూడు మండలాల్లో సత్తా చాటి అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను కై వసం చేసుకుంది. మరోవైపు కూటమి పార్టీల్లో అంతర్గత విభేదాలు, నేతల మధ్య ఘర్షణలు, గంటల తరబడి హైడ్రామా, పెద్దమనుషుల పంచాయితీల నడుమ మిగిలిన చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.
మూడు మండలాల్లో ఏకగ్రీవం..
కామవరపుకోట, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు.. కూటమి నేతల బెదిరింపులకు లొంగకుండా ఐక్యంగా నిలిచి పదవులను దక్కించుకున్నారు. కామవరపుకోటలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీపీగా మనెల్లి మద్దిరామయ్య, వైస్ ఎంపీపీగా మారోతి నాగపెద్దింట్లు ఎన్నికయ్యారు. జీలుగుమిల్లిలో 9 స్థానాలకు గానూ 7 స్థానాలు కై వసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీపీగా సున్నం ఉషారాణి, వైస్ ఎంపీపీగా వీరంకి నాగలక్ష్మి ఏకగ్రీవమయ్యారు. వేలేరుపాడులో ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి చెందిన బాడిస వెంకమ్మ, వైస్ ఎంపీపీగా సీపీఎంకు చెందిన యు. సరోజిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొయ్యలగూడెంలో బీజేపీకి జాక్‌పాట్
కొయ్యలగూడెం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారం కూటమి పార్టీల మధ్య రగడకు వేదికగా మారింది. ఎంపీపీ పీఠం టీడీపీకి దక్కగా.. వైస్ ఎంపీపీ పీఠం జనసేనకు ఇవ్వాలన్నారు. దీనికి ఒప్పుకోకపోగా.. వైస్ ఎంపీపీ పీఠం కూడా టీడీపీకే దక్కాలంటూ ఘర్షణకు దిగారు. దీంతో ఈ పంచాయితీ అధిష్టానం దృష్టికి వెళ్లగా, మండలంలో ఏకై క ఎంపీటీసీ స్థానం గెలుచుకున్న బీజేపీ అభ్యర్థి ఎస్‌ఆర్‌ఆర్ సుభద్రాదేవిని వైస్ ఎంపీపీగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీపీ పీఠం కోసం సుభద్రాదేవి చివరివరకు గట్టి పోటీ ఇచ్చారు. ఘర్షణను నియంత్రించడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు ప్రశాంతం
మెట్ట ప్రాంతంలో సత్తా చాటిన
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ
ద్వారకాతిరుమల ఎంపీపీ ఎంపికలో బిగ్ ట్విస్ట్
టీడీపీ అభ్యర్థితో ఖర్చు పెట్టించి
చివరకు బీజేపీకి కేటాయింపు
కొయ్యలగూడెంలో బీజేపీ ఖాతాలోకి వైస్ ఎంపీపీ
ద్వారకాతిరుమల: మండల ప్రజాపరిషత్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కూటమి పొత్తుల సమీకరణలో భాగంగా ఐఎస్ రాఘవాపురం ఎంపీటీసీ బోడపాటి లిల్లీ పుష్ప ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. తొలుత గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తిమ్మాపురానికి చెందిన యేపూరి దాలయ్య చిన్నకోడలు పావనిని ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. గుండుగొలనుకుంట ఎంపీటీసీగా ఆమె గెలవడంతో పదవి ఖాయమని భావించారు. అయితే, రాష్ట్రస్థాయి ఒప్పందంలో భాగంగా బీజేపీకి ఎస్సీ మహిళా కోటా కింద ఎంపీపీ స్థానం కేటాయించాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా చివరి నిమిషంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి గెలిచిన ఏకై క ఎస్సీ మహిళా ఎంపీటీసీ లిల్లీ పుష్ప కావడంతో అదృష్టం ఆమెను వరించింది. ఈ పరిణామంతో అసంతృప్తి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు గురువారం ఉదయం ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంకటరాజు బుజ్జగింపులతో మధ్యాహ్నం 12 మంది సభ్యులు హాజరుకాగా, ఎన్నికల అధికారి ఎస్. నిర్మలాజ్యోతి లిల్లీ పుష్ప ఎంపీపీగా, గంజి కాశీ విశ్వనాథం వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. పావని, మల్లాది మల్లేశ్వరి మినహా మిగిలిన సభ్యులు ఆఖరిలో ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో జెడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే టికెట్లను చివరి నిమిషంలో కోల్పోయిన దాలయ్య కుటుంబానికి, ఇప్పుడు కోడలి రూపంలో మరోసారి పదవి చేజారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


