రాణి తేనెటీగలే అవసరం | - | Sakshi
Sakshi News home page

రాణి తేనెటీగలే అవసరం

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

రాణి తేనెటీగలే అవసరం శోభనాచలుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం మద్దిలో ముగిసిన సప్తాహాలు ఉండి పోస్టాఫీసులో నిధుల దుర్వినియోగం కోతకు గురవుతున్న మట్టి కట్ట

తాడేపల్లిగూడెం: తేనెటీగల్లో రాణి తేనె టీగల ప్రాముఖ్యత తెలుసుకోవాలని కేవీకే సైంటిస్టు జి.శాలిరాజు అన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణలో గురువారం కీటకశాస్త్రవేత్త డాక్టర్‌ జి.శాలిరాజు పలు విషయాలపై అవగాహన కల్పించారు. క్వీన్‌ గ్రాఫ్టింగ్‌, ముళ్లు లేని తేనెటీగలు, వాటి ప్రాముఖ్యత, పెంపకంపై మాట్లాడారు. ప్రయోగాత్మక శిక్షణలో పలువురు పాల్గొన్నారు.

ఆగిరిపల్లి : ఆగిరిపల్లిలోని ప్రసిద్ధ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విశేష అర్చన, నవ కలశ పంచామృత స్నపనం, పూర్ణాహుతి నిర్వహించారు. ఉభయదాతలుగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు వ్యవహరించారు.

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న 33వ వార్షిక సప్తాహ మహోత్సవాలు గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. లోక కల్యాణార్థం, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, ప్రకతి వైపరీత్యాల నుంచి రక్షణ కలగాలని ఆకాంక్షిస్తూ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. అనంతరం సప్తాహ దీక్షా విరమణ గావించి, ఏడు రోజుల పాటు నిర్విరామంగా భజనలు, నామ సంకీర్తనలు చేసిన నాలుగు భజన మండలి సభ్యులను ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు.

ఉండి : స్థానిక పోస్టాఫీసులో రూ.14.29 లక్షల నిధుల దుర్వినియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 మార్చి 3 నుంచి 2023 మే 24 మధ్య కాలంలో అక్కడ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసిన కె.శ్రీనివాసబాబు.. పోస్టాఫీసుకు చెందిన సొమ్ము, ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.14,29,991ను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.ప్రవీణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై మల్లిఖార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని పురాతన వంతెన వద్ద రోడ్డు పక్కన మట్టి కట్ట భారీగా కోతకు గురైంది. ఇటీవల వరుస తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహించగా, నీటి ఉధృతికి పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. కొండవాగుల నీరంతా కడెమ్మ స్లూయిజ్‌ ద్వారా గోదావరిలోకి చేరుతుండగా, స్లూయిజ్‌–కడెమ్మ వంతెన మధ్య ప్రవాహ వేగానికి భారీ గొయ్యి ఏర్పడింది. మరోవైపు రోడ్డును ఆనుకుని నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మట్టి కట్ట జారిపోయింది. వర్షాలు, వరదల ప్రభావంతో కోత మరింత తీవ్రమైంది. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టకపోతే రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement