ఫలించని కూటమి కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఫలించని కూటమి కుట్రలు

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

● వేలేరుపాడులో వైఎస్సార్‌సీపీకి ఎంపీపీ పదవి దక్కకుండా కుతంత్రాలు

● పీసా కమిటీ రాజీనామా ఆమోదం సాకుతో అడ్డుకునే యత్నం

వేలేరుపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైన కూటమి నేతలు ఎంపీపీ పీఠాన్ని అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలేరుపాడు మండలంలోని మొత్తం 7 ఎంపీటీసీ స్థానాల్లో 4 స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుని ఎంపీపీ పదవిని దక్కించుకుంది. ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కట్కూర్‌ ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ సభ్యుడు సోడే సురేష్‌ గతంలో పీసా కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన అక్టోబర్‌ 20న ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్థానిక ఎంపీడీవోకు దరఖాస్తు అందజేశారు. అనంతరం ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసి ఎంపీటీసీగా గెలుపొందారు. అయితే, పీసా కమిటీ చైర్మన్‌ రాజీనామాను కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఆమోదించాల్సి ఉంది.

పీవో ఆమోదంలో జాప్యంపై విమర్శలు

అక్టోబర్‌ 20వ తేదీనే వేలేరుపాడు ఎంపీడీవో కార్యాలయం నుంచి పీవోకు లేఖ పంపినప్పటికీ, నేటికీ ఆమోదం తెలపలేదని సమాచారం. జిల్లా స్థాయి కూటమి నేతలు, అధికారుల ఒత్తిడి మేరకే కావాలనే రాజీనామాను ఆమోదించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి పీసా కమిటీలో ఉన్నప్పటికీ ఎంపీటీసీగా కొనసాగేందుకు చట్టపరంగా అభ్యంతరం లేదని పలువురు పేర్కొంటున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పీసా నిబంధనలను సాకుగా చూపి ఎంపీపీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి యత్నించినా, వారి కుతంత్రాలు ఫలించలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement