అడవినెక్కలంలో రాజకీయ నాయకుల ప్రచార చిత్రాలను తొలగిస్తున్న సిబ్బంది
బొమ్మిడిలో జనసేన స్థూపాన్ని బరకంతో కప్పిన అనంతరం నిలబడిన సిబ్బంది
ఉంగుటూరు: ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా బొమ్మిడి గ్రామ పంచాయతీ ఎదుట జనసేన స్థూపానికి బరకా కప్పకుండా ఉంచడంపై గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. వెంటనే స్పందించిన పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులు దగ్గరుండి స్థూపాన్ని బరకాతో కప్పించారు. ఈ విషయంపై ఎంపీడీవో వివరణ లేఖ పంపారు.
ఆగిరిపల్లి: ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు’పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అడవినెక్కలం పంచాయతీ కార్యాలయం గోడపై ఉన్న రాజకీయ నేతల ప్రభుత్వ ప్రచార చిత్రాలను తొలగించినట్లు ఎంపీడీవో అబ్దుల్ సలాం తెలిపారు.


