రాజకీయ వేధింపులు సరికాదు : మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
వేలేరుపాడు: వైఎస్సార్‌సీపీ వేలేరుపాడు మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల కన్వీనర్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీపీ, జెడ్పీ టీసీ స్థానాలను కై వసం చేసుకుంది. ఈ గెలుపును జీర్ణించుకోలేని టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. మండల కన్వీనర్‌కు చెందిన ప్రైవేటు ఆసుపత్రిపై ఈ ఏడాది జూన్ 4న దాడి చేసి ఆస్పత్రిలో అనుమతులు లేవంటూ డీఎంహెచ్‌ఓ శోభారాణి సీజ్ చేశా రు. దీంతో శ్రీనివాసరావు అప్పటి నుంచి భవనంలో ఆస్పత్రి నిర్వహించడం లేదు. ఇదే భవనంలోని ఓ గదిలో వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇదే గదిని అధికారులు మంగళవారం రాత్రి సీజ్ చేయడంతో వివాదం రేగింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలా కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో భవనంలో క్వాలిఫైడ్ డాక్టర్‌తో ఆస్పత్రి నిర్వహించేందుకు అనుమతి కావాలంటూ జిల్లా వైద్యాధికారికి ఆన్‌లైన్‌లో శ్రీనివాసగౌడ్ ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ పేరుతో వచ్చిన డీఎంహెచ్‌ఓ పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న గదిని సీజ్ చేయడానికి ప్రయత్నించగా, అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఐదు గంటల పాటు హైడ్రామా సాగింది. పంచా యతీ ఎన్నికల నామినేషన్‌ల చివరి రోజైన మంగళవారం కావాలనే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. తమకు పై నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, తమను అర్థం చేసుకోవాలంటూ చెప్పిన అధికారులు చివరకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం కొనసాగిస్తున్న గదిని సీజ్ చేశారు. ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి కుటిల రాజకీయాలు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. నిజంగా ప్రజల్లో బలం ఉంటే రాజకీయంగా రండి తేల్చు కుందాం అంటూ సవాల్ విసిరారు. కుక్కునూరు సీఐ బాలసురేష్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుమతి, వేలేరుపాడు వైద్యాధికారి ఆశాజ్వోతి, వేలేరుపాడు ఎస్సై నవీన్ తదితరులు ఉన్నారు.
కార్యాలయాన్ని సీజ్ చేస్తున్న అధికారులు
వేలేరుపాడులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద గుమిగూడిన కార్యకర్తలు
రాజకీయ విభేదాలు, విధానాలు ప్రజాసమస్యల పరిష్కారం దిశగా ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలు, వేధింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూటమి నేతలను ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేలేరుపాడు మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస్ గౌడ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, ఆయన చేస్తున్న వైద్య వృత్తిపై అధికార పార్టీ అండదండలతో అధికారులతో నిత్యం సోదాలు చేయించడం, పదేపదే ఆస్పత్రిని సీజ్ చేయించడం దారుణమ న్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కావాలనే పార్టీ ఆఫీసు నిర్వహిస్తున్న గదిని సీజ్ చేశారని, అధికారాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా, మానసికంగా వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. అన్నింటికీ సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని బాలరాజు హెచ్చరించారు.
ఎన్నికల నేపథ్యంలో వైద్యం చేస్తున్నారంటూ పార్టీ కార్యాలయం సీజ్
గతంలో సీజ్ చేసిన వైద్యశాలను మళ్లీ సీజ్ చేసిన డీఎంహెచ్‌ఓ
వేలేరుపాడులో ఐదు గంటల పాటు హైడ్రామా
మండల కన్వీనర్ శ్రీనివాసగౌడ్‌పై కుట్ర


