ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో ఏలూరు జిల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, పలువురు దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించారు. గత 14 రోజులకు రూ.1,32,29,492 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 186 గ్రాముల బంగారం, 2.318 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కలోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.7 వేలు లభించిందన్నారు.
దెందులూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్‌ను బుధవారం అమరావతి కార్యాలయంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ పి.జీవన్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా మేనేజర్ ఎస్.కృపావరం కలిసి వినతిపత్రం అందజేశారు. పాస్టర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని, గౌరవ వేతనం కోసం మరికొందరు దరఖాస్తు చేసుకునేలా ఆన్‌లైన్ పోర్టల్ తెరవాలని, జెరూసలెం యాత్ర సబ్సిడీ రూ.లక్ష అందించాలని, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్‌ల నియామకం చేయాలని, ఆ పదవులు బీసీ–సీ వారికి కేటాయించాలని కోరారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని ప్రిన్సిపాల్ సెక్రటరీ హామీ ఇచ్చారని నాయకులు చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రంలో 2026–27కి సంబంధించి నేషనల్ మీన్స్–కమ్–మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష వాయిదా వేసినట్టు, ఈనెల 29న నిర్వహించాల్సిన పరీక్షను వచ్చేనెల 13కు వాయిదా వేసినట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.
కై కలూరు: పెంచికలమర్రు గ్రామానికి చెందిన ముంగర ఫణికుమార్ 2025లో కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు విషయంలో కోర్టు వాయిదాలకు హాజరు కాని నేపథ్యంలో అతడిని బుధవారం అరెస్టు చేశామని రూరల్ ఎస్సై వి.రాంబాబు తెలిపారు. కై క లూరు 1వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో చర్యలు తీసుకున్నామన్నారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో ఆయన రిమాండ్ విధించారని చెప్పారు.


