కొల్లేరులో విహంగామా | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో విహంగామా

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

కొల్లేరులో విహంగామా ● పక్షుల వీక్షణకు అనువైన కాలం పక్షులను నేస్తాలుగా భావించండి

కొల్లేరుకు వలస వచ్చే విదేశీ పక్షులు కొన్ని..

బార్‌ టెయిల్డ్‌ గాడ్విట్‌

గ్రేట్‌ స్నైప్‌

బార్‌ హెడెడ్‌ గూస్‌

కొల్లేరులో పక్షుల సందడి

శీతాకాలం పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురం పక్షుల ఆవాసాలకు నిలయంగా ఉన్నాయి. అటవీశాఖ పక్షుల ఆవాసాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రంలో బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

– ఏ.త్రిమూర్తులురెడ్డి, డివిజనల్‌ ఫారెస్టు ఆఫీసర్‌, ఏలూరు

పక్షులు, పర్యావరణానికి విడదీయరాని సంబంధం ఉంది. పక్షులను అందరూ నేస్తాలుగా భావించాలి. కొల్లేరుకు విదేశీ పక్షులు వస్తున్నాయంటే ఇక్కడ పర్యావరణం పక్షులకు అనుకూలంగా ఉందనే అర్థం. పర్యావరణ కాలుష్యాం, ఆవాసం, ఆహారపు కొరత వల్ల కొన్ని జాతులు అంతరిస్తున్నాయి. పక్షుల సంరక్షణ అందిరి బాధ్యతగా మెలగాలి.

– దీపక్‌ రామాయణ్‌, వైల్డ్‌లైప్‌ ఎక్స్‌ఫర్ట్‌, సింగరేణి, తెలంగాణ.

కై కలూరు: చలికాలం వచ్చిందంటే చాలు.. జీవవైవిధ్య కేంద్రమైన కొల్లేరు సరస్సు విదేశీ, స్వదేశీ పక్షుల రెక్కల చప్పుళ్లతో కళకళలాడుతోంది. ఎటువంటి రాడార్‌ వ్యవస్థతో సంబంధం లేకుండా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన వలస పక్షులు కొల్లేరుకు చేరుతాయి. ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ప్రపంచంలోనే అత్యధిక రికార్డులు కలిగిన పక్షులు సైతం కొల్లేరు విడిదికి వచ్చేశాయి. ఏలూరు జిల్లా పరిధిలో కొల్లేరు సరస్సులో విహరిస్తున్నా పక్షులు రారమ్మని పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి.

రష్యా, సైబీరియా, మధ్య ఆసియా, ఉత్తర యూరప్‌, నైజీరియా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగినప్పుడు ఆహారం, ఆవాసం కోసం పక్షుల దక్షణ దిశగా ప్రయాణిస్తాయి. కొల్లేరు సరస్సు సెంట్రల్‌ ఏషియన్‌ ఫ్‌లైవే పరిధిలోని ముఖ్యమైన చిత్తడి నేలలో ఒకటి. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా, ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి.

పర్యాటకులకు మరపురాని అనుభూతి

పక్షులను పుస్తకాలు, టీవీలలో చూడడానికి ప్రత్యక్షంగా వీక్షించడానికి ఎంతో తేడా ఉంటుంది. ఏలూరు జిల్లా ఆటపాక, మాధవాపురం కేంద్రాల్లో బోటు షికారుతో వీటి అందాలను దగ్గర నుంచి చూడవచ్చు. ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పక్షుల పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లకు కొల్లేరు మంచి సందర్శనా ప్రాంతం. ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం (ఏలూరు జిల్లా), పులికాట్‌ పక్షుల సంరక్షణ కేంద్రం (తిరుపతి జిల్లా), ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం (గుంటూరు జిల్లా), నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం(తిరుపతి జిల్లా), కొండకర్ల అవా (అనకాపల్లి జిల్లా), తేలినీలాపురం(శ్రీకాకుళం జిల్లా), రొళ్ళపాడు వన్యప్రాణి, పక్షుల సంరక్షణ కేందం(నంద్యాల జిల్లా) సందర్శన ప్రాంతాలుగా ఉన్నాయి.

విస్కర్డ్‌ టెర్న్‌ (మీసముల రీవుపిట్ట), రివర్‌ టెర్న్‌ (రామదాసు), గార్‌గానీ (చుక్క ముక్కు బాతు), నార్తరన్‌ పిన్‌టైల్‌ (సూదితోక బాతు), యూరేషియన్‌ విడ్జియన్‌ (నామంబాతు), బ్రాహ్మణి షెల్‌ డక్‌ (బాపన బాతు), కాటన్‌ టీల్‌ (దూది చిలువ), రెడ్‌ క్రిస్టడ్‌ పోచర్డ్‌ (ఎరత్రల చిలువ), బార్‌ హెడడ్డ్‌ గూస్‌ (చందా మూతిబాతు), లిటిల్‌ స్టింట్‌ (చిన్న ఉల్లంకి), కామన్‌ సాండ్‌పైపర్‌ (ఉల్లంకి పిట్ట), రూప్‌ (ఈలవేసే పెద్ద చిలువ), ఉడ్‌ సాండ్‌పైపర్‌ (పొదల ఉల్లంకి), కామన్‌ రెడ్‌షాంక్‌(ఎర్ర కాళ్ళ ఉల్లంకి), పసిఫిక్‌ గోల్డెన్‌ స్లోవర్‌ (బంగారు ఉల్లంకి), గ్రేట్‌ వైట్‌ పెలికాన్‌ (తెల్ల చిలుక బాతు), బ్లాక్‌ క్యాప్డ్‌ కింగ్‌ఫిషర్‌ (నల్ల తల బుచ్చిగాడు), గుల్‌ బిల్డ్‌ టర్న్‌ (గౌరి కాకి ముక్కు రేవుపిట్ట), కాస్పియన్‌ టర్న్‌ (సముద్రపు కాకి) తదితర 71 విదేశీ పక్షులు ప్రతి ఏటా కొల్లేరుకు విడిదికి వస్తాయి.

ఈ పక్షి నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. ఎక్కడా ఆగకుండా 11వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి. గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం.

ఈ పక్షి సముద్ర మట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి కొల్లేరు, చిలుకా, పులికాట్‌ చేరుకుంటాయి.

శీతాకాలంలో విడిది పక్షుల సందడి

అతిథి పక్షుల రాకతో ఆటపాక పక్షుల కేంద్రం కళకళ

రారష్ట్రంలో 482 రకాల పక్షి జాతులు

ఏటా కొల్లేరుకు 1.20 లక్షల విదేశీ వలస పక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement