ఏలూరు (టూటౌన్): క్రీడలలో మన జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు. ఆసియా క్రీడల్లో స్విమ్మింగ్ విభాగంలో మూడు పతకాలు సాధించి, 2028 లాస్ ఏంజిల్స్ పారా ఆలింపిక్స్‌కు అర్హత సాధించిన జంగారెడ్డిగూడెం పారా స్విమ్మర్ బుడిగిన రవి వీర వెంకట భవాని కార్తీక్‌ను కలెక్టరేట్‌లో దుశ్శాలువాతో సత్కరించి, అభినందించారు. అనంతరం ఈ నెల 24న అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరగనున్న జిల్లా స్థాయి దివ్యాంగ పారా స్పోర్ట్స్–2026 ఎంపికల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పారా అసోసియేషన్ సభ్యులు జాకబ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.ఏ. అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధవారం వివిధ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. శేఖర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులకు నిర్వహించిన పోటీల వివరాలు
వ్యాసరచన పోటీ : ఉదయం 10 గంటలకు శ్రీగ్రంథాలయాల ప్రాముఖ్యతశ్రీ అనే అంశంపై నిర్వహించారు. దీనికి లెక్చరర్ డాక్టర్ తేజోమూర్తి, జర్నలిస్ట్ చలసాని వెంకట సురేంద్ర (పెప్సీ) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
వక్తృత్వ పోటీ : ఉదయం 11 గంటలకు శ్రీనేర్చుకోవడానికి చదవండి – నాయకత్వం వహించడానికి నేర్చుకోండిశ్రీ అనే అంశంపై నిర్వహించారు. దీనికి లెక్చరర్ ఎం. రాధారాణి, ఉపాధ్యాయుడు ఎం. వెంకట్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు, గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
కై కలూరు: పామర్రు – దిగమర్రు జాతీయ రహదారి గోనెపాడు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు వ్యాన్‌లు ఢీకొన్న ఘటన బుధవారం జరిగింది. స్థానికల కథనం మేరకు రొయ్యలు, ధర్మకోలా లోడ్లుతో వస్తున్న రెండు వ్యాన్లు డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల రోడ్డు మధ్యలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. వీరిలో ఒక డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిలో ఇతర వాహనాలు రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌నకు అంతరాయం ఏర్పడింది. రూరల్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.


