ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు

ఆగిరిపల్లి : మండలంలోని అడవినెక్కలం గ్రామపంచాయతీ కార్యాలయ గోడపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ల ప్రభుత్వ ప్రచార బ్యానర్‌ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ దర్శనమిస్తోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్నా, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. వీటికి ఎన్నికల కోడ్‌ వర్తించదా?.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఆ బ్యానర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

జనసేన అంటే ఎంత మక్కువో!

ఉంగుటూరు : ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ అధికారులకు జనసేన పార్టీపై ఉన్న మక్కువ ఎంతటిదో బొమ్మిడి గ్రామ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. బొమ్మిడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న పంచాయతీ కార్యాలయం ఎదుటే జనసేన పార్టీ జెండా స్తూపం, పార్టీ గుర్తు బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల జెండా స్తూపాలు, గుర్తులను తక్షణమే కప్పి ఉంచాల్సి ఉన్నా.. అధికారులు కనీసం ఆ పనిచేయకపోవడంపై స్థానికులు, అభ్యర్థులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement